లాక్ డౌన్ తో  థియేటర్లు బంద్ అయ్యాయి, షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ లు పోస్ట్ పోన్ అయ్యాయి,  కాల్ షీట్లు వేస్ట్ అవుతున్నాయి. ఇక బడ్జెట్ విషయం అంతకంతకూ పెరిగిపోయి తల్చుకుంటేనే  ప్రొడ్యూసర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ..? అసలు కరోనా ప్రభావం షూటింగ్స్ మీద ఎలా ఉ:డబోతోంది..? మరి ప్రొడ్యూసర్లు ఈ కరోనా  దెబ్బకి కాస్ట్ కటింగ్ చేస్తారా..?  లేక ఈ  క్రైసిస్ నుంచి బయటపడడానికి స్టార్లు , ప్రొడ్యూసర్లు , డైరెక్టర్లు వేరే ఏదైనా మాస్టార్ ప్లాన్ వేశారా..?
 

ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. కాస్ట్ కటింగ్ చెయ్యడంతో పాటు, నెక్ట్స్‌ జరగబోయే షూటింగ్స్ ని తెలివిగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ ఖాళీగా ఉండకుండా ఎవరి పరిథిలో జరగాల్సిన పనిని వాళ్లు చేస్తూ.. వర్క్ ని ప్రోగ్రెస్ మోడ్ లోనే ఉంచుతున్నారు అందరూ. ప్రజెంట్ షూటింగ్ జరగకపోయినా.. సినిమాలకు సంబందించి పనలు మాత్రం జరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్  చేస్తున్న వకీల్ సాబ్ ఇప్పటివరకూ జరగిన షూటింగ్ కి సంబందించి  పవర్ స్టార్ తన పార్ట్ డబ్బింగ్ కంప్లీట్ చేసేశాడు.

 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంబందించి 30 రోజులకు 50 కాల్‌షీట్స్ ఇచ్చాడు.  అయితే ప్రస్తుతం షూట్స్ ఆగిపోవడంతో దాన్ని కొంచెం తగ్గిద్దామని ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. అంతేకాదు .. వేణు శ్రీరామ్ రాసిన పవన్ లవ్ ట్రాక్ తోపాటు షూట్ డేట్స్ ని కూడా ట్రిమ్ చేద్దామని ఆలోచిస్తున్నారట టీమ్. 

 

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ కూడా సినిమా విషయంలో పక్కా స్కెచ్ తో ముందుకువెళుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ మార్చి 6 నెలలు పోస్ట్ పోన్ చేసిన  రాజమౌళి మళ్లీ ఈ సినిమా పోస్ట్ పోన్ కాకుండా అనుకున్న టైమ్ కే రిలీజ్ అయ్యేలా మాస్టర్ ప్లాన్ వేశాడు . ఇప్పటికే అయినషూటింగ్ పార్ట్ కి చరణ్, ఎన్టీఆర్ చేత ఇంట్లోనే డబ్బింగ్ చేయిస్తున్నాడు రాజమౌళి. అంతేకాదు .. ఈ సినిమాకు సంబందించి సీజీవర్క్, ఎడిటింగ్ కూడా అదే ఫ్లో లో చేయిస్తూ..సినిమా ఎక్కువ డిలే కాకుండా చూస్తున్నారు టీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: