ప్రభాస్ జాన్ సినిమా కూడా సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటూ ఉంది. అసలే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు కరోనా తో మరికొంత డిలే అయ్యేలా కనిపిస్తోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా జరగకూడదని .. జార్జియా లో జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే సెట్స్ వేసి చేద్దామని డిసైడ్ అయ్యారట టీమ్. అందుకే అన్నపూర్‌న స్టూడియోలో ఒకటి, రామోజీ ఫిల్మ్ సిటీలో 3 సెట్లు వేద్దామని డిసైడ్ అయ్యారట టీమ్.

 

కరోనా వల్ల ఎఫెక్ట్ అవుతున్న పెద్ద సినిమాల్లో చిరంజీవి ఆచార్య కూడా ఉంది. కొరటాలశివ డైరెక్షనలో తెరకెక్కుతున్న ఈ సినిమా  కూడా పోస్ట్ ప్రొడక్షన్,ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉంది. సినిమాని మరింత డిలే అవ్వకుడా చూడడానికి కొరటాల ఇలా ప్లాన్ చేశాడు.

 

పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కరోనా వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీతో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఇప్పుడు కరోనా దెబ్బకి కామ్ గా  మూలనపడి ఉన్నాయి. వాటిలో రెడ్ సినిమా కూడా ఉంది. రెడ్ కిసెన్సార్ వస్తే .. రిలీజ్ చేసెయ్యడమే.

 

హీరోలు కూడా ఖాళీగా ఏం లేరు. తమసినిమాలకు సంబందించిన పనుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు . అఖిల్ , భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అమెరికా షెడ్యూల్  క్యాన్సిల్ చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

 

నాని, శివనిర్వాణ కాంబినేషన్లోవస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ టక్ జగదీష్. మొన్నీ మద్య షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా అప్పుడే 30 పర్సెంట్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఇప్పటివరకూ జరిగిన సినిమాకు ఎడిటింగ్ తో పాటు స్టోరీకి ఇంకా బెటర్ మెంట్స్ చేసుకుంటోంది టీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: