వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈ కరోనా వల్ల రాబోయే కొన్ని నెలలు కూడా ఇబ్బంది పడాల్సొస్తుంది సినిమా ఇండస్ట్రీ. మరి  ఈ క్రైసిస్ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి కాపాడాలంటే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్  తీసుకుంటున్న స్టార్లు.. కొంచెమైనా రెమ్యూనరేషన్లోకోత పెట్టుకుంటారా..? ప్రొడ్యూసర్లకు డిస్కౌంట్ ఇస్తారా ..? సినిమాలు సాఫీగా సాగడానికి తమ వంతు సాయం అందిస్తారా..? అలా  జరిగితే కొంత లో కొంత  నిర్మాతలకు ఊరట కలిగి సినిమా బతికే  అవకాశం ఉంటుంది.

 

చాలా మంది నిర్మాతలు ఫైనాన్స్ లు తెచ్చి సినిమాలు చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ఆర్ధిక మాంద్యం అనేది ఫ్యూచర్ లో కూడా తప్పేలా లేదు. మరి మన దగ్గర సినిమా నిర్మాణంతో పాటు హీరోలు.. హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కూడా భారం అనే చెప్పాలి. అందులోను మన దగ్గర కొంచెం ఫేమ్ ఉన్న చిన్న హీరో కు 3 కోట్ల నుంచి మొదలు పెడితే.. పీక్ లో ప్రభాస్ లాంటి స్టార్స్ వంద కోట్ల వరకు తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లు 5కోట్ల పైనే వసూలు చేస్తున్నారు.. మరి పరిస్థితులు తారు మారు అవుతున్న టైమ్ లో.. హీరోలు తమ రెమ్యూనరేషన్ విషయంలో కొంతైనా తగ్గుతారా... ?

 

నిర్మాతలపై భారీగా ఆర్ధిక భారం పడుతున్న నేపధ్యంలో.. ఖర్చులు పెరిగి సినిమా నిర్మాణం భారం అయితే కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..హీరోయిన్లు ను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు అడిగే అవకాశం ఉంది. స్టార్ హీరో.. హీరోయిన్లు పేమెంట్ లో కోత పెడితే సినిమాకు  కొంతైనా కలిసొస్తుందనే  ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇప్పటి వరకు డొనేషన్లకే పరిమితం అయ్యారు కొంతమంది మూవీ స్టార్స్.. ఇండస్ట్రీనీ ఆదుకోవడానికి క్రైసిస్ చారిటీ తో ముందుకు వచ్చారు. కొంత మంది అదికూడా లేదు.. కొంత మంది కరోనా నివారణ ప్రకటనలకే పరిమితం అయ్యారు. అయితే ముందు ముందు స్టార్లు.. స్వచ్చందంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుని సహకరిస్తారా.. లేదా అనేది చూడాలి.

 

ఈ కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే వదిలేది కాదు. లాక్ డౌన్  తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీ అతి పెద్ద సవాల్ ఎదుర్కోబోతోంది. మరి ఇండస్ట్రీని కాపాడటానికి పెద్దల ప్రయత్నాలు ఎలా ఉంటాయి.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. స్టార్ల రెమ్యూనరేషన్ లో కోతలు.. అనవసరమైనఖర్చులు తగ్గించుకోవడం లాంటి వాటితో ఆర్ధిక మాంద్యం నుంచి కోలుకునే ప్రయత్రాలు చేస్తారా..? ఒక వేళ అన్ని సర్ధుమణిగినా థియేటర్ల లోకి వచ్చి సినిమా చూడటానికి ఆడియన్స్ ఎంత వరకు ఇంట్రస్ట్ చూపిస్తారు.. ఓటీటీల తో ఏమైనా ఒప్పందాలు చేసుకనే అవకాశం ఉందా.. ? ఏదీ ఏమైనా సినిమా  భవిష్యత్తుకు ఇది పెద్ద సవాలు అనే చెప్పాలి. మరి ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి హీరోలు ఏమాత్రం హెల్ప్  చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: