ఒకప్పుడు మా టివిలో కలర్స్ ప్రోగ్రామ్ తో పరిచయం అయిన స్వాతిరెడ్డి తర్వాత కలర్స్ స్వాతిగా పాపులర్ అయ్యింది.  కృష్ణవంశి డేంజర్ మూవీతో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు నాని నటించిన అష్టాచమ్మ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటంచింది.  మాలీవుడ్ లో కలర్స్ స్వాతికి బాగా క్రేజ్ వచ్చింది.  తెలుగు లో నిఖిల్ తో స్వామిరారా, కార్తికేయ మూవీస్ తో బాగా పేరు తెచ్చుకుంది.  తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీ త్రిపుర లాంటి హర్రర్ మూవీలో నటించింది.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే పైలెట్ వికాస్ వాసు వివాహం చేసుకుంది. 

 

ఈ మద్య స్వాతి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని.. అయితే ఆమె భర్త నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  దానికి కారణంగా గతంలో ఇలియానా, సనా ఖాన్ తదితర హీరోయిన్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తరువాత, వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. కలర్స్ స్వాతి కూడా అలాగే చేయడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.  స్వాతి భర్తకు దూరమైందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు బయలుదేరాయి.

 

ఈ విషయం పై కలర్స్ స్వాతి స్పందించి ఇలాంటి విచిత్రమైన వార్తలు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదని అన్నారు.  అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. భర్తతో తాను దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ, తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపిస్తూ, ఓ చిన్న వీడియోను తీసి, దాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు హారీపోటర్ డైలాగ్ ను కామెంట్ గా పెట్టింది. మరి ఈ పోస్ట్ చూసి కలర్స్ స్వాతి దాంపత్యం చక్కగానే ఉందని క్లారిటీ వచ్చిందని. ఇకనైనా ఈ రూమర్లకు చెక్ పెడతారో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: