హ్యాపీడేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్. ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాల సినిమాలు చేశాడు మరియు సక్సెస్ అయ్యాడు కూడా. హీరో నిఖిల్ చేసిన అర్జున్ సూరవరం సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టక పోయినా మంచిసినిమా అనిపించుకుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలు దాదాపుగా మూతపడ్డట్టైంది. అయినప్పటికీ దర్శకులు మరియు నిర్మాతలు కొన్ని కొత్త కథలను తమ హీరోల కోసం సిద్ధంచేస్తూనే ఉన్నారు.

 

 

అయితే హీరో నిఖిల్ కోసం నిర్మాత అల్లు అరవింద్ 18 పేజెస్ అనే సినిమా స్టోరీని సిద్ధం చేశారు.తాజాగా ఆ మూవీ ని లాంచ్ కూడా చేసినట్టు సమాచారం.  ఈ సందర్భంలో గీత ఆర్ట్స్ నిఖిల్ కోసం ఓ ట్వీట్ చేసింది..ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే " హీరో నిఖిల్ నీకోసం ప్రేమతో 18 పేజీల లవ్ లెటర్ ను సిద్ధం చేశాము. కానీ మాకు మాటలు సరిపోక డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ని సంప్రదిస్తున్నాం" అని ఆ ట్వీట్ పేరొకొంది .18 పేజెస్ మూవీ లాంచ్ కి అల్లు అరవింద్ తన ముద్దుల మనవరాలు అర్హతో వచ్చిన వీడియో సోషల్ మీడియా లో హాల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండగా .పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: