టాలీవుడ్ లో స్టూడెంట్ నెం.1 మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి మొన్నటి బాహుబలి 2 వరకు విజయకేతనం మొగిస్తూ వచ్చాడు.  మగధీర మూవీతో దర్శకధీరుడు గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ‘బాహుబలి2’ లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ రేంజ్ ఏంటో పెంచారు.  రాజమౌళి సినిమాలు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.. దాంతో పాటు ఆయన సినిమాలో ప్రతి హీరో కి ఓ ప్రత్యేకత ఉంటుంది.. అలాగే హీరో వాడే ఆయుధం కూడా వెరైటీగా ఉంటుంది.  బాహుబలి, బాహుబలి 2 కోసం ఏకంగా ఐదేళ్లు పాటు కష్టపడి భారతీయ సినీ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. 

 

అప్పటి వరకు కోలీవుడ్, బాలీవుడ్ కే జాతీయస్థాయి హోదా ఉండేది.. కానీ బాహుబలి, బాహుబలి 2 మూవీస్ తో టాలీవుడ్ రేంజ్ జాతీయస్థాయిలో పెరిగిపోయింది.  ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ తెరెక్కిస్తున్నారు.  ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ మోషన్ పోస్టర్ గ్రాఫిక్స్ మాయాజం చేసింది.  ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వివిధ భాషల నటులు నటిస్తున్నారు.   

 

బాలీవుడ్‌స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల‌తో పాటు కోలీవుడ్‌కి చెందిన స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్‌స‌న్‌, అలిస‌న్ డూడీలు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రంలో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ లో మోహన్ లాల్ నటిస్తున్నారన్న విషయంపై జక్కన్న క్లారిటీ ఇచ్చారు.  రీసెంట్ ఇంట‌ర్వ్యూలో జ‌క్క‌న్న‌ను ప్ర‌శ్నిస్తే అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని, ఆర్ఆర్ఆర్‌లో మోహ‌న‌ల్‌లాల్ న‌టించ‌డం లేద‌ని తేల్చి పారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: