ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.  ప్రతిరోజూ  ఈ వైరస్ తో మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  ఇక కేసులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కరోనాని కట్టడి చేయడానికి మనం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే అని.. లేదంటే ఇబ్బందులు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు.  ఇక లాక్ డౌన్ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటికే పరిమితం అయ్యారు.  దాంతో తాము ఇంట్లో చేస్తున్న సందడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  కొంత మంది వంటకాలు.. జిమ్, వ్యాయాలు, యోగా చేస్తుంటే మరికొంత మంది కరోనా  నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న విషయం పై టిప్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు.

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15 వేలు దాటింది. కొత్తగా  మొత్తం 15,712కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,651కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 211 మంది మృతి చెందారు. 365 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,893 కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 72 మంది కోలుకున్నారు. 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ప్రతి ఒక్కరి వద్ద ఉండే హ్యాండ్ కర్చీఫ్ తో మాస్క్ ను ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వీడియోల ద్వారా ప్రజలకు చూపించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ కూడా ఇదే విషయమై ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. బ్లౌజ్ పీస్ తో మాస్క్ ను ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో చూపిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: