మహేష్ బాబు సూపర్ స్టార్. సాధారణంగా తండ్రికి వచ్చిన బిరుదు కొడుకు పొందడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. మహేష్ బాబు విషయానికి వస్తే సూపర్ స్టార్ క్రిష్ణ మాదిరిగానే సూపర్ స్టార్ డం తొందరగానే అందుకున్నాడు. ఆయన బిరుదుని కూడా తీసుకున్నాడు.

 

అయితే మహేష్ కి ఒక లోటు ఉందని అంటారు. ఇంతటి సూపర్ స్టార్ డం అనుభవవిస్తున్నా కూడా మహేష్ బాబు కి పూర్తి స్థాయి మాస్ అప్పీల్ రోల్ ఇంతవరకూ రాలేదు. వస్తే మహేష్ ఎలా విరగదీస్తాడో చూడాలన్నది ఫ్యాన్స్ కి మాత్రమే కాదు అందరి కోరికగా ఉంది.

 

ఇక మహేష్ బాబు మాత్రం సరైన రోల్స్ కోసం చూస్తున్నాడు. మహేష్ ఇప్పటివరకూ ఎక్కువగా క్లాసిక్ టచ్ ఉన్న రోల్స్ మాత్రమే వేశాడు. పైగా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్కువగా దానికి సూట్ అయ్యేలా డైరెక్ట‌ర్లే మౌల్డ్ చేశారా అనిపిస్తోంది.

 

 

సరే ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ బాబుకు ఇపుడు తగ్గ రోల్ లభించేలా ఉంది అంటున్నారు. అదే సూపర్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో మహేష్ నటిస్తున్నాడు కదా. ఆ మూవీలో అదిరిపోయే రోల్ మహేష్ కి ఉంటుందని, పక్కా మాస్ రోల్ గా ఉంటుందని అంటున్నారు.

 

అయితే ఇంకా రాజమౌళి లైన్ అనుకోలేదు కానీ మాస్ పల్స్ తెలిసిన రాజమౌళి దానికి తగినట్లుగానే మహేష్ తో మూవీ చేస్తాడని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మహేష్ ఫ్యాన్స్ కి పండుగను జక్కన్న తీసుకురానున్నాడు అంటున్నారు.

 

మరి అది జేమ్స్ బాండ్ టైప్ క్యారక్టరా, లేక బాహుబలి లాంటి రాజ కుమారుడా, ఇంకా చెప్పాలంటే పల్లెటూరి నేపధ్యంలో పక్కా మాస్ హీరోగానా అన్నది చూడాలి. ఏది ఏమైనా జక్కన్న డిజైన్ తో మహేష్ బాబు కు పాన్ ఇండియా మూవీ రెడీ అయిపోయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: