జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలంకు చెందిన ఈ అమ్మాయి ముందుగా అక్కడ మోడలింగ్‌లో అడుగు పెట్టింది. అయితే విస్తృత అవకాశాల కోసం జాక్వెలిన్ బాలీవుడ్లో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది... ఇక్కడ మోడలింగ్ నుంచి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఛాన్సులు రావడం వాటిని అంది పుచ్చుకున్న ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం మూడున్నర పదుల వయస్సుకు చేరువ అయినా జాక్వెలిన్లో అందం ఏ మాత్రం తగ్గలేదు. అటు బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తూనే.. ఇటు మోడల్‌గాను.. అటు ఐటెం సాంగులతో అన్ని విధాలా ఫుల్లుగా సంపాదిస్తోంది.
గతేడాది ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా సాహోలో కూడా ఆమె అదిరిపోయే ఐటెం సాంగులో నటించిన సంగతి తెలిసిందే. ఈ హాట్ బ్యూటీ ముందుగా మోడలింగ్‌లోకి రావడానికి ముందు 2006లో మిస్ శ్రీలంకగా ఎంపికైంది. అదే యేడాది మిస్ యూనివర్సల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్లో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. ముందుగా సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అల్లాదిన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జాక్వెలిన్ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కిక్ 2 సినిమాలో నటించింది.
ఇక మర్డర్ 2, హౌస్‌ఫుల్ 2 సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక జాక్వెలిన్ ఈ క్రమంలోనే భారీగానే ఆస్తులు కూడబెట్టుకుందట. మన కరెన్సీలో చెప్పాలంటే ఆమె ఆస్తుల విలువ మొత్తం 9 మిలియన్ డాలర్లకు పై మాటే ఉంటుందని అంటున్నారు. అంటే రు. 90 కోట్ల నుంచి రు. 100 కోట్ల వరకు ఆమె సంపాదించిందని అంటున్నారు. .జాక్వెలిన్ ఒక్కో సినిమాకు సగటున రు. 2 నుంచి రు. 3 కోట్ల వరకు తీసుకుంటోంది. ఇక ఐటెం సాంగులకు కూడా ఆమె భారీగానే డబ్బు డిమాండ్ చేస్తోంది.
ఇక సల్మాన్ కిక్ సినిమాకు రు. 6 కోట్లు తీసుకుందట. అలాగే పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి కూడా బాగానే వెనకేసుకుందట ఈ హాట్ అమ్మడు.