పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరవాత ‘వకీల్ సాబ్’ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌, కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో అఫీషియల్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలోనే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అలాగే సాంగ్ తో ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. వాస్తవంగా  ఈ సినిమాని మే 15 న రిలీజ్ చేసే విధంగా నిర్మాత దిల్ రాజు పక్కాగా ప్లాన్స్ వేసినప్పటికి కరోనా వల్ల ఆ ప్లాన్స్ అన్ని తిరగబడిపోయాయి. 

 

ప్రస్తుతానికి ఇంకా కాస్త టాకీపార్ట్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. మే 3 న గనక లాక్ డౌన్ ఎత్తేస్తే జూలై నుండి నెమ్మదిగా సినిమాలు రిలీజ్ అవనున్నాయని సమాచారం. లేదంటే మళ్ళీ ప్లాన్స్ మారే అవకాశం ఉంది. ఇక జూలై నుండి ఒక్కొక్క సినిమాని రిలీజ్ చేసుకుంటు వచ్చేందుకు మేకర్స్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

 

ఇక ‘వకీల్ సాబ్’ సినిమాకి బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుందన్న వార్తలు వస్తున్నప్పటికి అధికారకకంగా ఇంకా తెలియలేదు.

 

ఇక అన్ని కుదిరి ఆగస్టులో గనక వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వస్తే మంచి వసూళ్ళు రాబట్టడం పక్కా అని అంటున్నారు. ఎందుకంటే అప్పటికే దాదాపు 5-8 సినిమాలు రిలీజవుతాయట. కాబట్టి ప్రేక్షకులు థియోటర్స్ కి రావడానికి అంతగా ఇబ్బంది పడరని చెప్పుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: