టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భరత్ అనే నేను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ గా పలు కమర్షియల్ హంగులతో దర్శకడు శివ ఈ సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించడం జరిగింది. బాలీవుడ్ భామ కియారా అద్వానీసినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. మహేష్ బాబు తొలిసారిగా తన కెరీర్ లో ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో నటించడం జరిగింది. 

IHG

సూపర్ స్టార్ సూపర్బ్ యాక్షన్, కొరటాల అద్భుతమైన డైరెక్షన్, అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, ఫోటోగ్రఫి వెరసి భరత్ అనే నేను సినిమాకి పెద్ద విజయాన్ని అందించాయి. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2000వ సంవత్సరం లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బద్రి. దర్శకుడిగా పూరి డెబ్యూ మూవీ అయిన బద్రి, అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడిగా ఫస్ట్ సినిమాతోనే పూరికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్షన్, పూరి జగన్నాథ్ అద్భుతమైన టేకింగ్, మాస్ యాక్షన్, ఫైట్స్, అదిరిపోయే రేంజ్ లో రమణ గోగుల అందించిన సాంగ్స్ వెరసి బద్రి సినిమాకి సూపర్ హిట్ చేసాయి. 

IHG

విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై  తెరకెక్కిన ఈ సినిమాకు టి త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే సరిగ్గా నేడు, అనగా ఏప్రిల్ 20 వ తేదీన ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కావడంతో, అటు భరత్ అనే నేను సక్సెస్ఫుల్ గా 2 ఏళ్ళు, అలానే ఇటు బద్రి సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరుగుతోంది. కాగా వీటిని పెద్ద ట్రెండ్స్ గా సెట్ చేసి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యా ఫ్యాన్స్ వీటిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు హ్యాష్ ట్యాగ్ లతో వీటిని పరిగెత్తిస్తున్నారు. ఒకరకంగా వారిద్దరి ఫ్యాన్స్ మధ్య ప్రస్తుతం ఈ రెండు సినిమాల విషయమై కొద్దిపాటి పోటీ జరుగుతోంది. మరి ఈ రసవత్తరమైన సోషల్ మీడియా పోరులో ఏ సినిమా గెలుస్తుందో చూడాలని పలువురు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మహేష్, పవన్ ఇద్దరికీ కూడా సమాన రేంజ్ లో క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో రెండు సినిమాలకు భారీగానే సపోర్ట్ లభించే అవకాశం కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: