మనదేశంలో కరోనా ప్రస్తుతం ప్రజలలో కలిగిస్తున్న భయం అంతా ఇంతా కాదు. మహమ్మారి చాలా విస్తృతస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరిలో ఒకరకమైన అలజడి మొదలైంది. సమయంలో ప్రాణాంతక వైరస్ మనకి సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అయితే మన దేశంలో చాలా చోట్ల ప్రజలు దీనికి భిన్నంగా ఎదుటి వ్యక్తి లేదా ఎవరైనా అపరిచితులు వచ్చిన వెంటనే వారిపై రసాయనాలు చల్లడం చాలా కామన్ అయిపోయింది.

 

 

దక్షిణాదిలో తక్కువ కాని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఎవరైనా కొత్త వారు వస్తే వారి పైన పొడులు చల్లడం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే మేము చేస్తున్నదంతా మీ మంచికే కదా అని పలువురు సమర్థించుకుంటున్న తీరు కూడా ఏమాత్రం స్వాగతించలేనివిగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చల్లడం మధ్య మరీ ఎక్కువ అయినట్టు ఇక అటువంటి చర్యలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వెల్లడించింది.

 

అంతే కాకుండా దీనిని ఒక అనాగరిక చర్యగా ప్రభుత్వం వారు అభివర్ణించారు. గుంపుల పైన లేడా వ్యక్తుల పైన ఎటువంటి పురుగుల మందులు, రసాయనాలు, పొడులు చల్లడానికి వీలు లేదని.... అలా చేస్తే వారికి శారీరకంగా మరియు మానసికంగా చాలా కీడు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

ఇలాంటి చర్యలతో వైరస్ చస్తుందా? బతుకుతుందా? అన్నది పక్కన పెడితే.. చర్య సబబు కాదని చెబుతున్నారు. ఇలాంటి స్ప్రేల కారణంగా కరోనా చనిపోతుందనే దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు.. పరిసరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం.. భౌతికదూరాన్ని పాటించటం.. చేతులకు గ్లోవ్స్ వేసుకోవటం లాంటివి మంచిదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: