టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి కి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తో సినిమా చెయ్యాలి అని చాలా మంది హీరోలకు అదొక పట్టుదలగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా జక్కన్న చాలా నిదానంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన దూకుడు ప్రదర్శించి సినిమాలు చేసిన సందర్భం అనేది లేదు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. దాదాపుగా సినిమా షూటింగ్ అంతా  అయిపోయినట్లే. 

 

జక్కన్న కూడా ఇటీవల మాట్లాడుతూ ఇదే విషయం చెప్తూ వచ్చారు. ఇక ఈ సినిమాలో ఒకటి రెండు కీలక సన్నివేశాలు ఉండగా అవి షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే సినిమా విడుదల వాయిదా పడింది అనేది కొందరి మాట. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడానికి గానూ జక్కన్న రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సినిమా చేసే విషయంలో ముందు నుంచి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మహేష్ సాఫ్ట్ హీరో... ఈ మధ్య కాలంలో జక్కన్న చేసిన సినిమాలను ఒక్కసారి చూస్తే మహేష్ తో ఆయన చేసే అవకాశం ఉండదు అనే అనుకున్నారు అందరూ కూడా. 

 

అలాంటిది మహేష్ బాబు తో సినిమాను ఓకే చేయడం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత జకన్న సినిమా. అయితే ఈ సినిమా చేయాలి అని మహేష్ బాబే రాజమౌళి ని రిక్వస్ట్ చేసాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎప్పటి నుంచొ మహేష్ అడగడం తో కాదు అనలేక ఈ సినిమా చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: