టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఎక్కువగా పెరిగిన నేపధ్యంలో రాజకీయ నాయకులు ఎక్కువగా సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నారు. స్థాయికి తగిన విధంగా రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులే సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మన తెలుగు హీరోలు కూడా కొన్ని కారణాలతో వారితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

మార్కెట్ పెరగడమే కాకుండా వాళ్ళ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు కాబట్టి సినిమాలను చూసే అవకాశం ఉంది అనేది హీరోల భావన. ఇది ఇలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా గల్లా జయదేవ్ వ్యవహరించే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒక కథ సిద్దంగా ఉందని తర్వాత ఆ కథ లో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ సినిమా మీద తారక్ ఎక్కువగా ఆశ పడుతున్నాడు అంటున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ గా ఉన్నాడు. జక్కన్న దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గల్లా తో సినిమా చేసే సూచనలు ఉన్నాయని టాక్. ఈ సినిమా కోసం గల్లా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట. మూడేళ్ళ క్రితమే ఈ సినిమాను చెయ్యాల్సి ఉంది అంటున్నారు. కొన్ని కారణాలతో అది వాయిదా పడిందట. మరి నిజమో కాదు చూడాలి అంటే ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: