టాలీవుడ్ లో యాంకర్ గా మంచి ఊపులో ఉన్న అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. అగ్ర హీరోల సినిమాలకు గానూ ఆమెకు కీలక పాత్రలు వస్తున్నాయి. వారి తో ఆమె కూడా సినిమా చెయ్యాలి అని చూస్తుంది. యాంకర్ గా బిజీ గా ఉన్నా సరే సినిమాల మీద ఆమె ఎక్కువగా ఫోకస్ చేసిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఆమెకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆమె కు ఇప్పుడు మరో సినిమాలో ఆఫర్ వచ్చింది అంటున్నారు. ఆమె ఇప్పుడు పుష్ప సినిమాలో నటించడానికి రెడీ అయినట్టు సమాచారం. పుష్ప సినిమాలో విలన్ భార్యగా ఆమె నటించే అవకశం ఉంది. 

 

ఆమె కోసం ఇప్పటికే సుకుమార్ ఫోన్ కూడా చేసి పాత్రను వివరించారు. ఆమె రంగస్థలం సినిమాలో ఒక కీలక పాత్ర చేయగా ఆ పాత్రకు మంచి ఆదరణ వచ్చింది. అందుకే ఇప్పుడు ఆమె ఈ సినిమాలో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమాకు కూడా దర్శకుడు సుకుమార్ కావడం తో ఆమె ఏ మాత్రం కూడా వెనకడుగు వేయలేదు అని సమాచారం. కథ బాగా నచ్చడం పారితోషికం కూడా ఎక్కువగా ఉండటం తో ఆమె ఓకే చేసింది అంటున్నారు. మన తెలుగులో ఒక్కసారి క్లిక్ అయితే చాలు వాళ్ళ సినిమాల కోసం జనం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. 

 

అందుకే ఇప్పుడు అనసూయ నుంచి మంచి పాత్రలను మన తెలుగు జనాలు ఆశిస్తూ వస్తున్నారు. ఆమె కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: