షూటింగ్ లు లేకపోయినా సుకుమార్ మాత్రం ప్రస్తుతం తన సమయాన్ని పూర్తిగా ‘పుష్ప’ పై పెట్టి ఆ మూవీ స్క్రిప్ట్ మరింత బాగా వచ్చేలా చాల పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తరువాత ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నా సుకుమార్ ప్రస్తుతం తన ఇంటి నుంచే ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపికతో పాటు ఈ మూవీలోని పాటల ట్యూన్స్ విషయంలో సుకుమార్ తో చాల లోతుగా చర్చలు జరుపుతూ ‘అల వైకుంఠపురములో’ ఆడియో స్థాయికి మించి ‘పుష్ప’ లో పాటలు ఉండేలా సుకుమార్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

 

ఇది ఇలా ఉండగా ఈ మూవీ నుంచి తమిళ హీరో విజయ్ సేతుపతి తప్పుకున్న విషయానికి సంబంధించిన అసలు కారణం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ ను సుకుమార్ 5 భాషలలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈ మూవీలో అన్ని భాషలకు సంబంధించిన నటులను కీలక పాత్రలలో పెట్టడానికి సుకుమార్ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. 

 

ఈ క్రమంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అల్లు అర్జున్‌తో ఢీకొట్టే స్ట్రాంగ్ విలన్ రోల్‌ లో చూపించాలని సుకుమార్ భావించాడు. అయితే ‘పుష్ప’ మూవీలో తాను విలన్ రోల్ చేస్తా కానీ ఒక్క తమిళ భాషలో మినహా అన్నిభాషల్లో నటిస్తానని ఒక కండిషన్ పెట్టాడట విజయ్ సేతుపతి. 

 

దీనికి కారణం కోలీవుడ్ లో తాను స్టార్ హీరోగా మంచి ఆదరణలో కొనసాగుతున్న పరిస్థితులలో తనను విలన్ గా చూపెడితే తమిళ ప్రేక్షకులు ఒప్పుకోరు కాబట్టి తమిళ వెర్షన్ లో మాత్రం విలన్ రోల్ చేయలేనని ఆ ఒక్క భాషలో వేరే నటుడిని చూసుకోమని విజయ్ సుకుమార్ కు సూచించాడట. అయితే ఈ మూవీ ఒకే కాలంలో 5 భాషలలో తీస్తున్నపరిస్థితులలో కేవలం ఒక్క భాష కోసం మరో విలన్ అంటే కష్టమని భావించిన సుకుమార్ విలన్ రోల్ కోసం వేరే నటుడిని వెతికే పనిలోపడి విజయ్ సేతుపతి స్థానంలో కన్నడ యాక్టర్ ధనుంజయ్‌ని తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనితో విజయ్ సేతుపతి కన్ఫ్యూజన్ ధనమ్ జయ్ కు అదృష్టంగా మారింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: