పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించినప్పటి నుండి  ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ని తెరమీద చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలని ప్రకటించి  వారి ఆనందాన్ని డబుల్ చేశాడు.  బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాలోనూ, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మాస్ మసాలా చిత్రంలో నటిస్తున్నాడు. 

 


అయితే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ నుండి రెండు చిత్రాలు వస్తాయని అంచనా వేశారు. వకీల్ సాబ్ చిత్రాన్ని మే నెలలో చూస్తామని అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారి ఆశలకి అడ్డు పడుతూ, మొత్తం పవన్ కళ్యాణ్ ప్లాన్ నే డిస్టర్బ్ చేసింది కరోనా మహమ్మారి. కరోనా కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోవడంతో వకీల్ సాబ్ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

 

అదీ గాక పవన్ కళ్యాణ్ మీద అంత డబ్బు పెట్టి తీస్తున్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసినా కూడా సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశ్యంతో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తెరుచుకున్నా జనాలు థియేటర్లకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల వకీల్ సాబ్ కి వేసుకున్న ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. 

 

అయితే ఈ సినిమాని లాక్డౌన్ గడువు ముగిసిన మూడు నెలలకి అంటే ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అప్పటి వరకు అన్నీ సర్దుకుంటాయన్న ఉద్దేశ్యంతో ఆగస్టు ౧౫వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ చిత్రబృందం ఈ దిశగా ఆలోచిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్ సి ఏ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: