హీరోయిన్లకి ఏదో ఒక సినిమా ద్వారా బ్రేక్ వస్తుంటుంది. ఎన్నో సినిమాల్లో నటించినా, ఆ బ్రేక్ ఇచ్చిన సినిమానే అందరికీ గుర్తుంటుంది. అయితే అలా బ్రేక్ ఇచ్చిన మూవీలో ఆమె రెండవ హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది. సోలో హీరోయిన్ గా హీరోల పక్కన చేసిన చిత్రాలేవీ గుర్తింపు తీసుకురాకుండా, ఇద్దరు హీరోయిన్లలో తాను కూడా ఒకరిగా ఉన్నా.. ఆ సినిమా బ్రేక్ ఇచ్చిందంటే  అది ఎంత పెద్ద హిట్ అయ్యుండాలి.

 

అవును నిధి అగర్వాక్ కి బ్రేక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. టెంపర్ తర్వాత పూరీకి హిట్ లేని సమయంలో పూరి పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న వేళ ఇస్మార్ట్ శంకర్ తో వారందరికీ గట్టిగా చెప్పాడు. ఈ సినిమా పూరి ఒక్కడికే కారు హీరోగా నటించిన రామ్ కీ, హీరోయిన్లుగా చేసిన నభా నటేష్, నిధి అగర్వాల్ కి మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది.

 

 

అప్పటి నుంది ఈ ఇద్దరు హీరోయిన్లకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నిధి అగర్వాల్ గ్లామర్ తో అందరినీ కట్టిపడేసింది. పాటల్లో ఆమె చూపించిన గ్రేస్ కి అందరూ ఫిదా అయ్యారు. అప్పటి వరకూ కెరీర్లో హిట్ లేని నిధికి ఇస్మార్ట్ తో మంచి విజయం దక్కింది. అలాగే సినిమా అవకాశాలని కూడా తెచ్చి పెట్టింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో నిధి అగర్వాల్ ఆన్ లైన్ కోర్సు నేర్చుకుంటుందిట.

 


నటనలో మరింత ప్రావీణ్యం సంపాదించడానికి ఆన్ లైన్ కోర్సును ఎంచుకుని రెగ్యులర్ గా క్లాసెస్ వింటుంది. నటనలోనే కాకుండా స్క్రిప్టు ఎలా రాయాలో, డైరెక్షన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటుందిట. హీరోయిన్ గా కెరీర్ ఉండేది తక్కువ రోజులే అన్న ఉద్దేశ్యంతో.. ఆమె సినిమాలోని మరిన్ని క్రాఫ్ట్ ల మీద దృష్టి పెడుతుంది. మొత్తానికి లాక్డౌన్ సమయాని నిధి అగర్వాల్ బాగానే ఉపయోగించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: