ఈ లాక్‌ డౌన్‌ సమయంలో ఖాళీగా ఉండగా కూడా వరుసగా సినిమాలు చూస్తున్నారు మూవీ లవర్స్‌. అయితే ఈ టైంలో ఏ సినిమాలు చూడాలి. బెస్ట్ మూవీ ఆప్షన్‌ ఏంటి..? అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అందుకే అలాంటి వారి కోసం బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ ఇస్తున్నాం. వీలైతే ఈ సినిమాలు చూసి ఆ థ్రిల్‌ను మీరు ఫీల్ అవ్వండి.

 

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా సైలెన్స్‌ ఆఫ్ ద లంబ్స్‌. జోనాతన్‌ డెమ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్‌, హర్రర్ జానర్‌లకు మధ్యలో రూపొందించారు. అంతేకాదు ఆస్కార్‌లో అతి తక్కువ సార్లు నామినేట్ అయిన క్యాటగిరిలో ఈ సినిమా కూడా ఉండటం విశేషం. బఫెల్లో బిల్ అనే సీరియల్‌ కిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా లేకపోయినా ఆడియన్‌ను ప్రతీ సన్నివేశంలో థ్రిల్‌కు గురించే అంశాలు ఉంటాయి.

 

ఈ టైంలో చూడటానికి మరో బెస్ట్ ఆప్షన్ బేసిక్ ఇన్‌స్టింక్ట్‌. ప్రేక్షకుడ్ని సీట్ అంచున కూర్చోబెట్టే బెస్ట్ థ్రిల్లర్‌ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. కాస్త అడల్డ్ కంటెంట్ ఉన్నా ఆ లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో చూసేందుకు ఈ సినిమా కూడా ఓ బెస్ట్ ఆప్షన్‌.

 

మెమెంటో కూడా ఈ లాఖ్ డౌన్‌లో చూసేందుకు బెస్ట్ ఆప్షన్‌. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా రెట్రో స్టైల్‌లో రూపొందింది. ఓ వింత జబ్బుతో బాధపడే సీరియల్‌ కిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి విపరీతంగా నచ్చుతుంది.

 

ఇక అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న బెస్ట్ థ్రిల్లర్ మూవీ పారాసైట్‌. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. వరుసగా తెర మీద వచ్చే ట్విస్ట్‌ లు ఆడియన్స్‌కు షాక్ ఇస్తాయి. సామాజిక సమస్యల నేపథ్యానికి ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

 

ఈ హాలీడేస్‌లో మరో బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఆప్షన్‌ లేడీ వెంజెన్స్‌. 2005లో రిలీజ్ అయిన ఈ సౌత్‌ కొరియన్ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. జైలు నుంచి రిలీజ్ అయిన ఓ అమ్మాయి తను జైలు వెళ్లడానికి కారణమైన వ్యక్తులను వెంటాడి చంపటమే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమా కథతో పాటు ఈ సినిమా కోసం ఎంచుకున్న మేకప్‌ ప్యాట్రన్‌ కూడా ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: