అల్లు అర్జున్సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కు‌తున్న హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప‌'. దాదాపు 11ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది. చివరిగా 2009లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుక్కు ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాడు. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది.

 

రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. దీని కోసం అల్లు అర్జున్ ఇప్పటికే శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాకుండా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' ఛాయలు కూడా 'పుష్ప'లో కనిపిస్తున్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బన్నీ లుక్ బయటికి వచ్చాక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఎలా కనిపించబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ఆమె పుష్ప రాజ్ ప్రియురాలిగా పల్లెటూరి అమ్మాయిగా కనిపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 

 

ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రచారం లోకి వచ్చింది. పుష్ప లో బన్నీ రోల్ చాలా సీరియస్ అట. ఆద్యంతం తీవ్రమైన ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఉంటుందట. బన్నీ గత చిత్రాలలో వలె కొంచెం కూడా కామెడీ యాంగిల్ కూడా ఆయన పాత్రలో ఉండదట. ఇది కూడా రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుండగా రష్మికతో రొమాంటిక్ సీన్స్ కూడా తక్కువ ఉండే అవకాశం కలదని టాక్. సో బన్నీ - రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఆశపడే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగించే విషయమనే చెప్పవచ్చు. మరి వారి మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయో తెలియాలంటే రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: