టాలీవుడ్ జనాలు ఇప్పుడు ఎక్కువగా కొత్తదనం కోరుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో సినిమా అయినా పెద్ద హీరో సినిమా అయినా సరే జనాలకు ఇప్పుడు బాగా కొత్తదనం అనేది అవసరం అయింది అనే విషయం అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనకు తగిన విధంగానే దర్శకులు హీరోలు ఆలోచన చేస్తున్నారు. హీరోల పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తూనే... అందులో హీరోని కాస్త భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి సినిమా హిట్ అయితే మాత్రం కొత్తగా ఆలోచించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే... ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది పుష్ప అనే  టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అతను గుడ్డి వాడిగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక కన్ను అతనికి కనపడదు అని అంటున్నారు. హీరో పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని అతను గుడ్డి వాడిగా అంటే ఒక కన్ను కనపడదు అని సమాచారం. సినిమాలో ఒక సన్నివేశం లో అతని ప్రమాదం జరిగి కన్ను పోయే అవకాశం ఉంటుందని  నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. 

 

ఇక హీరోయిన్ కి కూడా ఒక కన్ను కనపడే అవకాశం ఉండదు అని వాళ్ళు ఇద్దరూ ఆస్పత్రిలో కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కంటి ఆస్పత్రి లో హీరో హీరోయిన్ కి మధ్య పరిచయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీసుకొస్తున్నారు దర్శకుడు. ఈ సినిమా ను దాదాపు 150 కోట్లతో నిర్మించే అవకాశం ఉందని సమాచారం. కథలో ఎక్కువగా అడవి ప్రాంతం లోనే షూట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: