టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అంతే తెలియని వారు ఉండరు. మహేష్ బాబు తన వృత్తి కోసం ఎంతటి డెడికేషన్ చూపిస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే.. నేడు (ఏప్రిల్ 20) సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తిలిపాడు మహేష్. సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ మెసేజ్‌ను ఎంతో క్యూట్‌గా అభిమానులతో పంచుకున్నారు మహేష్.
``ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా’’ అంటూ ఇందిరా దేవి, మహేష్ బాబు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. కాగా, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలోనూ తండ్రి కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు సోదరుడు, సోదరీమణులు కనిపిస్తారు కానీ.. ఇందిర గారు కనిపించిన సందర్భాలు చాలా అరుదని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి ఎంత వెతికినా దొరకదు.
కేవలం ఒక సామాన్యురాలిగా ఆమె ఉంటారు. కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం జరిగిపోయింది. ఇక వాస్తవానికి ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు అవుతుంది. సొంత మరదలినే కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు. అయితే విజయనిర్మలతో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఎలాంటి లోటూ లేకుండా చూసుకున్నారు. తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను గొడవులు పెడితే పరువు తీసి పందిరేసినట్లు అవుతుందని ఇందిర భావించేవారట. అలాంటి పెద్ద మనస్సున ఇందిర దేవి పుట్టిన రోజు నేడు.
April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020