దేశంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.  ఈ నేపథ్యంలోనే గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సందర్భంగా కేసులు తగ్గిపోతాయని భావించారు.. కానీ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దాంతో వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు.   ఈ విషయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి సూచనలు సలహాలు ఇస్తూ తెలియజేశారు.  లాక్ డౌన్ కారణంగా అన్ని మూవీ షూటింగ్స్, రిలీజ్ లు అగిపోయాయి.  ఇక సెలబ్రెటీలు అందరూ ఇంటిపట్టున ఉంటున్నారు. 

ఖాళీగా ఉండకుండా వంటలు ఇతర కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నవ్వుల రాజు బ్రహ్మానందం, తనలోని చిత్రకారుడిని నిద్రలేపారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు బ్రహ్మానందం లెక్చరెర్ గా పనిచేసేవారు.. అంతే కాదు ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్.. చిత్రకారులు.  జంద్యాల దర్శకత్వంలో అహనా పెళ్లంట చిత్రంతో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టారు.  ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తనదైన కామెడీ పండించారు.. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. 

 

తాజాగా ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని ఆయన పెన్సిల్ తో గీశారు. ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం బ్రహ్మానందం  కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'రంగ‌మార్తాండ‌'లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: