నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  తాజాగా దగ్గుబాటి రానా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  70వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.  అయితే ఇంత ప్రత్యేకంగా రానా ఆయన ఫోటో షేర్ చేయడానికి వెనుక ఓ కారణం ఉంది. ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ హీరోగా నటించిన విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూవీస్ ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకర్షించలేకపోయాయి.  

 

ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీస్ రెండు ఫ్టాప్ టాక్ తెచ్చుకున్నాయి.  అయితే ఈ ఎన్టీఆర్ మహానాయకుడు మూవలో దగ్గుబాటి రానా టీడీపీ అధినేత నారా చంద్రబాబుపాత్రలో నటించారు.  అచ్చం ఆయన హావభాబాలు పలికించి క్యారెక్టర్ పరంగా మంచి మార్కులు కొట్టారు.  అప్పట్లో ఈ పాత్ర కోసం చంద్రబాబు నాయుడిని క్రిష్, దగ్గుబాటి రానా, బాలయ్య కలిసిన విషయం తెలిసిందే.  దీంతోపాటు ఒకప్పటి చంద్రబాబు ఫొటోను షేర్ చేశారు.

Happy birthday sir was so exciting

అంతేకాక, నందమూరి బాలకృష్ణ మూవీ 'ఎన్టీఆర్'లో తాను పోషించిన చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా జతచేశారు. 'హ్యాపీ బర్త్ డే సర్. మీ పాత్రను పోషించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా  అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వల్ల అన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అంతే కాదు కొన్ని సినిమాల రిలీజ్ సైతం వాయిదా వేశారు.  దాంతో సెలబ్రెటీలు అందరూ ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  రానా నటించిన హాతీ మేరీ సాతి మూవీ కూడా వాయిదా పడింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: