సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టులో శ్రుతి హాసన్ ప్రముఖంగా ఉంటుంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. సినిమాల్లో ఎంత సక్సెస్ అయిందో వివాదాల ద్వారా అంతే పాపులర్ అయింది శ్రుతి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ ఇండస్ట్రీకి విరాళాలు ఇస్తున్నారు. ఇదే విషయంపై ఆమెను సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ప్రశ్నించగా శ్రుతికి కోపం వచ్చిందట. తనను ట్రోల్ చేసిన నెటిజన్ల కు ధీటైన సమాధానం చెప్పినట్టు సమాచారం.

 

 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రుతి ఇటీవల తాను ఇంట్లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫోటోలకు కామెంట్ల రూపంలో కొందరు నెటిజన్లు ‘ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కొంత సేవ చేస్తే బాగుండేది కదా’, ‘కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ఇచ్చే ఉద్దేశం లేదా’ అంటూ కామెంట్‌ చేశారట. ఈ తరహా ట్రోలింగ్ కు శ్రుతికి కోపం వచ్చిందట. ‘కరోనా క్రైసిస్ టైమ్ లో చారిటీ ఎందుకు చేయవు అని నన్ను ప్రశ్నించే మీరు ఎంతమాత్రం సేవ చేస్తున్నారో చెప్పండి. నాకు సాయం చేయడం తెలుసు. గతంలో ఏం చేశానో చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇవ్వాలి అనిపిస్తే నేనే ఇస్తాను.. సలహాలు తీసుకోను‘ అంటూ ఘాటు రిప్లై ఇచ్చిందట.

 

 

‘ఇటువంటి సమయాల్లో ఇళ్లలోనే ఉండాలని కూడా గుర్తు పెట్టుకోండి. ఖాళీ సమయాల్లో మానసిక ఉల్లాసం ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన వ్యపకాలు చేయడంలో కూడా తప్పు లేదు’ అని కూడా సమాధానం చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో రౌండ్ అవుతోంది. నెటిజన్లు అత్యుత్సాహంతో చేసే కొన్ని కామెంట్లు ఒక్కోసారి సెలబ్రిటీల ఆగ్రహానికి కారణమవుతాయనడానికి శ్రుతి ఉదంతమే ఉదాహరణ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: