రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2021 సంవత్సరం జనవరి 8వ తేదీన విడుదల కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజమౌళి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 
 
తారక్, చరణ్ ఇద్దరికీ ఆర్ఆర్ఆర్ సినిమా కథను ఒకేసారి చెప్పానని... తారక్ వస్తున్నాడని చరణ్ కు తెలీదని... చరణ్ వస్తున్నాడని తారక్ కు తెలీదని... ఒకరికి తెలీకుండా ఒకరికి షాక్ ఇచ్చానని అన్నారు. వాళ్లిద్దరూ ఒకేసారి ఒకరినొకరు చూసుకుని తారక్ ఇక్కడున్నాడేంటని చెర్రీ... చెర్రీ ఇక్కడున్నాడేంటి అని తారక్ అనుకున్నారని చెప్పారు. ఇద్దరికీ ఆర్ఆర్ఆర్ సినిమా కథను తన ఇంట్లోనే చెప్పానని అన్నారు. 
 
కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ టీజర్ విడుదల చేశామని... జూనియర్ ఎన్టీయార్ పుట్టినరోజుకు మరో టీజర్ విడుదల చేస్తామో చేయలేమో చెప్పలేనని అన్నారు. లాక్ డౌన్ ను బట్టి టీజర్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా అందరూ ఊహించుకుంటున్న విధంగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కడం లేదని ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. 
 
వ్యక్తిగతంగా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది లేదని అన్నారు. థియేటర్లు ఓపెన్ అవ్వడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని అన్నారు. మరో రెండు సంవత్సరాల పాటు మనందరిపై కరోనా ప్రభావం తప్పకుండా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా దర్శకత్వం వహిస్తానని ప్రకటన చేశారు. భవిష్యత్తు కొంత ఆందోళనగానే ఉందని రాజమౌళి వ్యాఖ్యనించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: