పవన్ కళ్యాణ్ అప్పట్లో తీసిన రొమాంటిక్ చిత్రాలు ఇప్పటికి అందరినీ అలరిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసిన అన్ని సినిమాలలో 3 కొత్త సినిమాలను ఈ ఆర్టికల్ లో తెలియజేయి పోతున్నాం. ఈ లాక్ డౌన్ సమయంలో మేము చెప్పబోయే ఈ 3 పవన్ కళ్యాణ్ సినిమాలు తప్పకుండా చూడండి.


1. తొలిప్రేమ:

1998 వ సంవత్సరంలో తెరకెక్కిన తొలి ప్రేమ సినిమాలో హీరోహీరోయిన్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి నటించారు. రొమాంటిక్ చిత్రమైనా తొలిప్రేమ ఇప్పటికే అందరి మనసులో మెదులుతుంది. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అందుకే ఈ లాక్ డౌన్ ఈ సమయంలో తొలిప్రేమ చిత్రం చూడడానికి ప్రయత్నించండి.


2. తమ్ముడు:

1999వ సంవత్సరంలో విడుదలైన తమ్ముడు చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగ్యానీ కథానాయకుడు కథానాయకి పాత్ర లలో నటించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. జో జీతా వహీ సికందర్ హిందీ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ్ముడు సినిమా ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగ్యానీ మధ్య చోటు చేసుకున్న రొమాంటిక్ ఎమోషనల్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ బాక్సింగ్ సన్నివేశాలు, పాటలు అద్భుతంగా ఉండడంతో... తమ్ముడు భారీ హిట్ అయ్యింది. ఈ లాక్ డౌన్ సమయంలో తమ్ముడు చిత్రం ఒక్కసారి చూడవచ్చు.


3. ఖుషి:

తమిళం లో రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిన కుశి చిత్రాన్ని మూలంగా తీసుకొని పవన్ కళ్యాణ్ తెలుగులో ఖుషి సినిమాని తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలకి ఎస్. జే. సూర్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక చావ్లా నటించగా... వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు చాలా అద్భుతంగా పండాయి. ఈ సినిమా తర్వాత నే భూమిక చావ్లా తన సినీ జీవితంలో వెనుతిరిగి చూడలేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ భూమిక చావ్లా కాంబినేషన్ వెండిితెరపై ఒక మ్యాజిక్ చేసింది అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: