టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కజిన్స్ అయినా వీరి మ‌ధ్య సొంత సోద‌రులను మించిన అనుబంధం ఉంటుంది. రాజ‌మౌళి ఈ రోజు ప్ర‌పంచం మెచ్చిన ద‌ర్శ‌కుడు అయినా కూడా త‌న ప్ర‌తి సినిమాకు త‌న సోద‌రుడు కీర‌వాణినే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఇక కీర‌వాణి త‌న సినిమాల‌కు సంగీతం ఇవ్వ‌డంతో పాటు త‌న సినిమాల క‌థ‌ల్లో మైన‌స్‌లు కూడా చెపుతూ ఉంటాడ‌ని... త‌న సోద‌రుడి జ‌డ్జ్‌మెంట్‌కు తాను ఎంతో విలువ ఇస్తాన‌ని చెప్పారు.

 

సోమ‌వారం రాజ‌మౌళి ఓ టీవీ ఛానెల్ లైవ్‌లో మాట్లాడుతూ ముందుగా క‌థ సిద్ధం అయ్యాక ఆ సీన్లు వింటూ అందులో లోపాల‌ను నిష్క‌ర్ష‌గా చెపుతాడ‌ని.. ఇక షూటింగ్ కంప్లీట్ అయ్యాక కూడా సీన్లు చూసి అందులో ఏది తేడా కొడుతుందో ?  త‌న అభిప్రాయం నిర్మొహ‌మాటంగా చెపుతాడ‌ని రాజ‌మౌళి చెప్పాడు. సినిమాలో కీర‌వాణిని మెప్పించ‌ని సీన్లు ఉంటే వాటిని ఆలోచించి అవి ఉంచాలా ?  లేదా వాటి స్థానంలో ఇంకైమ‌నా పెట్టాలా ? అన్న నిర్ణ‌యం కూడా తాను తీసుకుంటాన‌ని.. అది తాను ఆ జ‌డ్జ్‌మెంట్‌కు ఇచ్చే విలువ అని రాజ‌మౌళి చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: