ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ధనికులు పేదలు ఉద్యోగులు వ్యాపారులు అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలామంది ఎన్నో రోజుల నుండి ఫ్యామిలీతో సమయం గడపాలనుకుని సమయం లేక గడపలేక పోయిన వారు ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతుంటారు. దీంతో కుటుంబం తో రోజు హాయిగా మాట్లాడుతూ ప్రేమగా పలకరించూకుంటున్నారు. ఇది అంతా బాగానే ఉంది కానీ ఒకటి రెండు మూడు రోజులు మా అంటే వారం రోజులు ఆ తర్వాత అయితే ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొట్టడం ఖాయం కదా. ఇలాంటప్పుడే మంచి ఎంటర్టైన్మెంట్ పంచేందుకు మనకు నచ్చిన సినిమాలు చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ వేరేలా  ఉంటుంది. 

 

 

అది కూడా ఫ్యామిలీ అందరితో హాయిగా సోఫాలో కూర్చుని... పాప్ కార్న్ తింటూ సినిమాలను  చేస్తుంటే అబ్బో ఆ సుఖం వేరు అనిపిస్తూ ఉంటుంది కదా. లాక్ డౌన్  సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలను చూసి ఆహ్లాదాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్.. సినీ ప్రేక్షకుల అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. అందుకే ఇలా లాక్ డౌన్  సమయంలో ఖైదీనెంబర్150 చూసి తెగ ఎంజాయ్ చేయొచ్చు. 

 

 

 అంతేకాకుండా ఈ లాక్ డౌన్  సమయంలో కాస్త దేశభక్తి ఉన్న సినిమా చూడాలి అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా చూడొచ్చు. ఈ సినిమాలో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూసి ఉండకపోతే ఇలాంటి లాక్ డౌన్  సమయంలో ఈ సినిమా చూడడం ఎంతో బెటర్. అయితే ఈ కొత్త సినిమాలు ఆల్రెడీ చూసేసాము  అంటారా  అలా అయితే మెగాస్టార్ త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు సినిమా చూస్తే ఇంకా మజా వస్తుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే విధంగా మెగాస్టార్ నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా ఉంటుంది. అంతేకాకుండా మెగా స్టార్ హీరోగా నటించిన చంటబ్బాయి, ఇంద్ర  లాంటి సినిమాలు కూడా చూసి తెగ ఎంజాయ్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: