సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్రిన్స్. మహేష్ సినిమాలలోనే కాదు.. నిజ జీవితంలో ఎంతో మందికి సహాయం చేస్తూ సరిలేరు నీకెవ్వరు అని పేరుకు స్వార్థం చేస్తునాడు ఈ సూపర్ స్టార్. ఇంకా తాజాగా మహేష్ బాబు ఈ మూడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. 

 


1. శ్రీమంతుడు: 

శ్రీమంతుడు ఈ సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో రూలర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మారుమూల ప్రాంతాలలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలో అన్న దాని మీద కోర్సు చేస్తూ.. వాటిని వారి సొంత ఊర్లో అమలు చేస్తూ.. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా అనుగుణంగా మహేష్ బాబు నిజ జీవితంలో కూడా ఒక ఊర్లని దత్తత తీసుకొని ఆ ఊరికి సరిపడా డెవలప్మెంట్ అన్నీ కూడా తన సొంత ఖర్చుతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 

 


2. మహర్షి: 

ఆ తర్వాత మహర్షి సినిమాతో 2019 లో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో మహేష్ కు ఫ్రెండ్స్ గా పూజా హెగ్డే, అల్లరి నరేష్ లు నటించారు. ఈ సినిమాలో కూడా అన్నదాత రైతులకు సంబంధించి.. ప్రజలు అందరికి ఒక మంచి సందేశం ఇచ్చేలాగా  సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అలాగే స్నేహితుడి కోసం మహేష్ బాబు ఎంత సహాయం చేశాడు కూడా ఈ సినిమాలో చాల బాగా చూపించారు. ఇక ఈ సినిమా మంచి హిట్ సాధించింది.

 


3. సరిలేరు నీకెవ్వరు: 


సరిలేరు నీకెవ్వరు ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ మేజర్ పాత్ర వహించారు. ఇక ఈ సినిమాలో లేడీ టైగర్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు. అలాగే చాలా రోజుల తర్వాత.. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రజలకు ఒక సైనికుడు విలువ గురించి చాలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం జరిగింది. అలాగే ప్రజలలో మంచి అవగాహన కల్పించే విధంగా ఈ సినిమా రూపొందించారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: