ప్రస్తుతం కరోనా  వైరస్ నియంత్రణకీ  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే సెలవులు  అందరూ హాయిగా ఉన్నామని కొన్ని రోజుల వరకు బాగానే ఆనంద పడినప్పటికీ తర్వాత మాత్రం ఇంట్లో కూర్చొని కూర్చొని చాలా మంది బోర్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు.. ఇంట్లో టీవీ ఉండగా ఇంకేంటి కుటుంబంతో కలిసి హాయిగా మీకు నచ్చిన మీరు మెచ్చిన హీరో సినిమాలు చూడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాలు చూడాలి అంటే అది విక్టరీ వెంకటేష్ సినిమాలు అని చెప్పాలి. కుటుంబంలోని బంధాలు అనుబంధాలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిగిన చిత్రాలు విక్టరీ వెంకటేష్ ఎక్కువగా నటిస్తూ ఉంటాడు అనే విషయం తెలుసిందే . 

 

 ఇక్కడ ప్రస్తుతం లాక్ డౌన్  సమయంలో బాగా బోర్ కొడుతుంది అనుకునే  వాళ్ళందరూ హాయిగా ఫ్యామిలీతో కూర్చుని విక్టరీ వెంకటేష్ కు సంబంధించిన ఫ్యామిలీ సినిమాలు చూడాలి అంటే  అందులో ముందుగా గుర్తొచ్చేది. సంక్రాంతి... ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సంక్రాంతి సినిమా ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ తో పాటు శ్రీకాంత్ శర్వానంద్ శివబాలాజీ నలుగురు నటిస్తారు . అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం ఆత్మీయత సంక్రాంతి సినిమాలో బాగా చూపిస్తారు. అందుకే ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అందుకే లాక్ డౌన్  సమయంలో మరోసారి ఈ సినిమా చూసేయండి. ఆ తర్వాత వెంకటేష్ సినిమాలు చూసి కడుపుబ్బ నవ్వు కోవాలి అంటే ప్రేమంటే ఇదేరా అనే సినిమా చూస్తే ఎంతో బాగుంటుంది 

 

 

ఎందుకంటే ఈ సినిమాలో వెంకటేష్ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. అంతేకాకుండా లాక్ డౌన్  సమయంలో మంచి త్రిల్లింగ్ సినిమా చూడాలి అంటే వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా నటించిన దృశ్యం సినిమా చూస్తే ఎంతగానో బాగుంటుంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎన్నో ట్విస్టులు ఎత్తులు పై ఎత్తులతో సాగిపోతూ ఉంటుంది ఈ సినిమా. లాక్ డౌన్  సమయంలో ఎక్కడా బోర్ కొట్టకుండా కళ్ళార్పకుండా చేస్తుంది ఈ సినిమా. మరొకటి వెంకీ మామ తాజాగా విడుదలైన వెంకీ మామ సినిమా మామ అల్లుళ్ళ మధ్య బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో వెంకటేష్ నటించిన ఈ సినిమాలు  చూసి హాయిగా బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో సమయం గడపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: