అక్కినేని నాగార్జున ఎన్నో సినిమాల్లో న‌టించారు. అయితే మ‌న్మ‌ధుడు సినిమా ఆయ‌న కెరియ‌ర్‌లో చాలా పెద్ద హిట్ అని చెప్పాలి.  విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ చిత్రం అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయింది. ఆ చిత్రంలో త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగ్స్‌ని ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు చేసుకుంటున్నారు. త‌న ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి పెళ్ళికార్డు ఇచ్చి సార్ మీరు నా పెళ్ళికి రావొద్దు అంటారు. అక్క‌డి నుంచి వ‌చ్చే స‌న్నివేశాలు కానీ, పాట‌కాని ప్ర‌తి ఒక్క‌టీ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో మ‌న్మ‌ధుడి స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టించారు. ఒక‌రు అన్షు, మ‌రొక‌రు బాలీవుడ్ భామ సోనాలిబింద్రె న‌టించింది.

 

ఫ‌స్ట్ ఆఫ్ మొత్తం అన్షుతో రొమాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత సెకండ్ ఆఫ్‌లో సోనాలితో క‌లిసి ఆట‌ప‌ట్టించే విధంగా సాగే ప్రేమ‌కోణాన్ని ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు.  ఇవే కాకుండా ఈ సినిమాలో సునీల్ బంకుసీను పాత్ర గిలిగింత‌లు పెట్టిస్తుంది.  పారిస్‌టూర్‌లో బ్ర‌హ్మానందం వాళ్ళ‌ను రిసీవ్ చేసుకున్న ప‌ద్ధ‌తి నుంచి వాళ్ళు ఇండియా వెళ్ళే వ‌ర‌కు జ‌రిగే ప్ర‌తి స‌న్నివేశం ఇప్ప‌టికి ప్రేక్ష‌కుడి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఉంటుంది. ఆ చిత్రాన్ని ఎన్నిసార్లు బుల్లితెర‌లో ప్ర‌ద‌ర్శించినా దాని టిఆర్పీ రేటింగ్ దానికే ఉంటుంది. ఇందులో ఉండే ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సీక్రెట్ స్పీక‌ర్స్‌ని అమ్మే పాత్ర‌లో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం పూర్తి ఎంట‌ర్‌టైన్ చేశార‌ని చెప్పాలి. త‌నికెళ్ళ‌భ‌ర‌ణి బాబాయ్, పిన్ని పాత్ర‌లో సుధ వీరిద్ద‌రూ కూడా ఎంతో స‌ర‌దాగా సాగే ఫ్యామిలీ ఎయోష‌న్ బాండింగ్ సీన్ చాలా బావుంటుంది. 

 

ఈ చిత్రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షిస్తే చాలా బావుంటుంది. ఈ లాక్‌డౌన్‌లో ఈ సినిమా కుటుంబ స‌భ్యులంద‌రినీ లాక్‌డౌన్ చేసేలా ఉంటుంది. ఇందులోని సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మోస్ట్‌లీ ఇంట్లో బోర్ ఫీల‌య్యేవారు ఈ సినిమా పెట్టుకుంటే మీకు మంచి ఎంట‌ర్‌టైన్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: