దేశంలో కరోనా రోజు రోజుకీ దాని ప్రభావం బీభత్సంగా చూపిస్తుంది.  అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాల్లో మృత్యుఘోష వినిపిస్తుంది. అన్ని దేశాల కంటే అత్యధికంగా అమెరికాలో 39,090 మంది చనిపోయారు. అమెరికాలో 7,35,287 మంది కొవిడ్-19 బారినపడ్డారు. ఇటలీ 23,227 మరణాలతో యూరప్ లో ప్రథమస్థానంలో ఉంది. స్పెయిన్ లో 20,453, ఫ్రాన్స్ లో 19,323, బ్రిటన్ లో 15,464 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.  మన దేశంలో కూడా కరోనా ప్రభావం బాగానే చూపిస్తుంది.  కరోనా మహమ్మారి భారిన పడ్డవారి సంఖ్య 17,265 చేరింది. 543 చనిపోగా, 2,547 మంది డిశ్చార్జ్ అయ్యారు.   తెలంగాణలో మొత్తం 858 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 

 ఈ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.  కేంద్రం లాక్ డౌన్ 3 వరకు ప్రకటిస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం మే 7 వరకు పొడిగించారు.  మే 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.. 5 న మరోసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.  తాజాగా కేసీఆర్ సంచలన నిర్ణయాలపై పలువురు ప్రశంసలు కురిపించారు. మన ప్రాణాల కొన్న గొప్పవి ఏవీ కావని అన్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మనమంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సీఎంపై నాకు చాలా నమ్మకం ఉంది.ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రభుత్వం మనందరినీ సాధ్యమైన ఉత్తమ మార్గంలో బయటకు తీసుకొస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు. దీన్ని తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: