యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ పేరుకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నందమూరి నటవారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గొప్ప పేరు సంపాదించుకున్నారు. అచ్చం తాతగారిలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. సాంఘికాల్లో సరేసరి. బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షించే చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారాయన. అయితే ఈ నంద‌మూవి చిన్నోడి సినీ కెరీర్‌లో ఎన్నో సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద భూకంపాన్ని సృష్టించాయి. అందులో దీ బెస్ట్ సినిమాలు ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

 

అందులో ముందుగా స్టూడెంట్ నెంబర్ 1. ఎన్టీఆర్‌కి హీరోగా ఇది రెండొవ‌ సినిమా. ఈ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళికి ఇదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. ఈ సినిమా వీరిద్దరికి భారీ సక్సెస్‌తో పాటు స్టార్‌డమ్‌ను కూడా సాదించిపెట్టింది.  జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశము. మంచి క‌థ‌, క‌థ‌నంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన ‘సింహాద్రి’ సినిమా ఎంత‌టి ప్రభంజనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవడంతోపాటు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంతో రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగెస్ట్ హిస్ట్‌గా సింహాద్రి నిలిచింది. సింగమళైగా ఎన్టీఆర్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాంటి సినిమాపై మ‌రోసారి లుక్కేయాల్సిందే.

 

అలాగే ఎన్టీఆర్ జ‌క్క‌న్న మ‌రో బిగ్గెస్ట్ స‌క్సెస్ అందించిన చిత్రం యమ‌దొంగ‌. ఈ సినిమా కూడా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టించి అప్ప‌ట్లోనే 30.1కోట్ల షేర్‌ను ద‌క్కించుకుందంటే మామూలు విష‌యం కాదు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్  యంగ్ యమగా తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసారు. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఈ సినిమాను కూడా ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

 

ఇక వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన ఎన్టీఆర్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమా టెంప‌ర్‌. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిఫరెంట్‌గా నిలిచింది.  ఈ చిత్రం నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల్లో రీమేక్ కూడా చేశారు. నిర్భయ థీమ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్ట‌రే హైలైట్‌గా చెప్పుకోవాలి. మ‌రి అలాంటి సినిమాపై ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఓ లుక్కేయాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: