కరోనా కల్లోలం దేశంలోని వ్యవస్థలను లాక్ డౌన్ పరిస్థితుల్లోకి నెట్టేసింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాల్సిన వస్తోంది. ఒకరకంగా ఈ బిజీ లైఫ్ లో మర్చిపోతున్న మానవ సంబంధాలను కరోనా గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఈ పరిస్థితుల్లో తాము ఇంట్లో ఏం చేస్తున్నాం.. ఎలా ఉంటున్నాం.. వాళ్ల హాబీలు ఏంటనే వాటిపై సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా తాను ఇంట్లో ఏం చేయగలనో, ఏ పనిలో ప్రావీణ్యం ఉందో ఓ టీవీ చానెల్ లో జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

 

ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘మా ఇంట్లో ప్రైమ్ మినిస్టర్‌... ప్రెసిడెంట్ అన్నీ నా భార్య ‘రమా’నే. ర‌మానే మా ఇల్లు ఎలా ఉండాలో.. లుక్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. ఇంటిని చాలా అందంగా ఉంచుతుంది. ఇంట్లో అంద‌రికీ ప‌నులు అసైన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఆర్డర్ ప్రకారమే ఇల్లు తుడ‌వాలి. నా బ‌ట్టలు నేనే ఉతుక్కోవాలి.. డ్రెస్సింగ్‌ చేసుకోవాలి. నేనూ అలానే నడుచుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు వంటింట్లో అంట్లు తోముతాను.. బ‌ట్టలు ఉతుకుతాను. నా పనులు నేను చేసుకుంటూ ఇంటి పనులు చేస్తాను. కానీ.. వంట మాత్రం రాదు. ఆ విభాగంలోకి మాత్రం నేను అడుగుపెట్టలేదు’ అని వివరించారు.

 

 

రీసెంట్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటి పనులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. రాజమౌళి కూడా ఇలా చేసి ప్రజల్లో అవేర్ నెస్ తీసుకురావాలని కోరాడు. దీనికి రాజమౌళి కూడా ఓకే చేశాడు. మరి.. రాజమౌళి తన ఇంటి పనులు  ఎప్పుడు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడో చూడాలి. మొత్తానికి బిజీ లైఫ్ లో చేయలేనివి కరోనా టైమ్ లో కుదురుతున్నాయన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: