ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

 

కరోనా పై నివారణకు  ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో ను పొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. 

 

 

 

 

 

సినిమా అంటే ఫ్యాషన్ కలిగి ఉన్న నటీనటులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఓ సువర్ణ అవకాశాన్ని కల్పించారు.. ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యలను పాటిస్తూ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించాలని తెలిపారు. ఆ షార్ట్ ఫిలిం కనుక ప్రజలను మెప్పించగలిగితే లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేస్తూ  సోషల్ మీడియా ద్వారా వీడియోను పోస్ట్ చేశారు.ఆ వీడియోలో షార్ట్ ఫిల్మ్ చేయాలనుకొనే వారు వారి పేరును నమోదు చేసుకోవడానికి ఒక లింక్ ను కూడా షేర్ చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: