తెలుగులో కొరటాల శివ కు ఉన్న డిమాండ్ సంగతి తెలిసిందే. ఆయన కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలను తీయడానికి గానూ ఆయన ఎంచుకునే కథల నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమా చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. చిన్న చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల అసలు ముందుకి రావడం లేదు. ప్రస్తుతం కొరటాల తెలుగులో చేస్తున్న సినిమా ఆచార్య. 

 

సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తాడు అనేది పక్కన పెడితే ఆచార్య సినిమా తర్వాత ఆయనకు బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందని సమాచారం. బాలీవుడ్ లో టాప్ హీరో ఒకరు ఆయనతో సినిమా చేయడానికి ముందుకి వచ్చినట్టు సమాచారం. ఆ సినిమా కు నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా దాదాపు ఆ హీరో దగ్గర ఉంద్యని అందుకే ఇప్పుడు ఆ సినిమాను దర్శకత్వం చెయ్యాలి అని కొరటాల శివను అడిగినట్టు సమాచారం. 

 

కథ పూర్తిగా సిద్దంగా ఉంది కాబట్టి తాను ఫైనాన్స్ చేస్తాను అని ఆ హీరో చెప్పారట. అవసరం అనుకుంటే ఈ కథను మీరు మార్చవచ్చు అనే ఆఫర్ ని కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది రావడం ఖాయం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కొరటాల చేస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి ప్రభుత్వ ఉద్యోగి తో పాటుగా రాజకీయ నాయకుడి గా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కోణం లో ఈ సినిమా వచ్చే సూచనలు ఉన్నాయి. ఆచార్య అనే టైటిల్ ని ఖరారు చేసారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: