ఆకాశం వైపే అందరి చూపూ ఉంటుంది. ఎవరైనా శిఖరం ఎక్కాలని చూస్తారు. కానీ ఎక్కిన వాడికి తెలుస్తుంది, ఇంక ఇక్కడ ఏముంది. మళ్ళీ కిందకే కదా రావాలి. ఇది కాల చక్రంలో సహజమైన పరిణామం.

 

దాన్ని కరోనా మరో రూపంలో అందరికీ పాఠాలు చెప్పబోతోంది. ఇంతవరకూ కో అంటే కోటీ పారితోషికం తీసుకునే తారలంతా ఇపుడు దిగిరావాల్సిందేనని అంటున్నారు. కరోనా వైరస్, దాని వల్ల లాక్ డౌన్ చిక్కులతో ఇపుడు సినిమా బొమ్మ అడ్డంగా పడిపోయింది.

 

దాన్ని మళ్ళీ లేపి కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ నేపధ్యంలో సినిమాలకు జనం వస్తారా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఇక సినిమా హిట్లు అసలే తగ్గిపోయాయి. ఇపుడు వీర లెవెల్లో స్లంప్ ఉంది. దాని నుంచి బయటపడి  ముందుకు సాగాలంటే ఎంతటి వారికైనా కష్టమే.

 

ఈ నేపధ్యంలో చూసుకుంటే సినిమా హీరోలు కూడా సగానికి సగం తగ్గుతారు. ఇక సినిమాకు కోటి అంటున్న అందాల భామలు కూడా సగం సైజ్ తగ్గాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. ఇపుడే స్టార్ డం వచ్చి పూర్తిగా సొమ్ము చేసుకుందామనుకుంటున్న పూజా హెగ్డె, రష్మిక వంటి తారలకు ఇది ఇబ్బందికరమైన పరిణామం
అంటున్నారు. 

 

అసలే సినిమ పరిశ్రమలో గట్టి పోటీ ఉంది. మరో వైపు బాలీవుడ్ భామలు కూడా రెడీగా ఉన్నారు. ఈ టైంలో పారితోషికం ఇంతే అని మొండికేస్తే కూడా ఫిల్మ్ మేకర్స్     మరో చాయిస్ చూసుకుంటారు.  ఓ విధంగా ఇది రెండు వైపులా ఇరకాటమేనని అంటున్నారు.

ఇక వర్ధమాన తారలు, హీరోయిన్ల అవకాశాల కోసం ఎదురుచూసే వారికి కూడా కరోనా కాటు అలా ఇలా ఉండదని అంటున్నారు. రిస్క్ చేసేందుకు నిర్మాతలు ముందుకు రాని పరిస్థితులు ఉండడం వల్ల వారు కూడా అవకాశాలకు ఇబ్బందులు పడతారని విశ్లేషిస్తున్నారు  మరి చూడాలి. కో అంటూ కొండెక్కిన ముద్దు గుమ్మలు ఎంతవరకూ దిగివస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: