రెండు సార్లు సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో  మూవీస్ చేసి  భారీగా దెబ్బతిన్నాడు  విజయ్ దేవరకొండ. ఇప్పుడు   ఫైటర్ తో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు విజయ్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేస్తోన్న ఫైటర్ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అంతకు ముందు కూడా నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

 

గ్యాప్ తరువాత మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు మంచు బ్రదర్స్. చెరో సినిమాతో హడావిడి చేయబోతున్నారు. అందులోను మంచు విష్ణు నటిస్తోన్న మోసగాళ్ళు మూవీని అటు హాలీవుడ్ తో పాటు ఇటు ఇండియాలో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అన్నలాగానే గ్యాప్ తీసుకుని రాబోతున్న మంచు మనోజ్  కూడా తన సినిమా అహం బ్రహ్మస్మి కూడా నాలుగు భాషల్లోరిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Here comes the First look of our Pan indian film #AhamBrahmasmi. #AB is all set to make some loud noise after the years of my absence on screen . Promising you some goosebumps with this crime, comedy & action packed film🔥 #AhamBrahmasmiFirstLook #AhamBrahmasmiFL #ABFL

A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu) on

 


యంగ్ హీరో నిఖిల్ చూపు  మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ పైనే ఉంది. హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న నిఖిల్ తాను చేయబోతున్న కార్తికేయ—2 మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడని తెలిసింది. అంతే కాదు ఖచ్చితంగా మూడు భాషల్లో పక్కాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట నిఖిల్. ఇలా చిన్న పెద్ద స్టార్స్ అంతా కూడా ఫ్యాన్ ఇండియా మూవీస్ వైపు చూస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Please share if you like it Gals and guys @chandoo.mondeti @abhishekofficl @peoplemediafactory @tgvishwaprasad

A post shared by nikhil Siddhartha (@actor_nikhil) on

మరింత సమాచారం తెలుసుకోండి: