ప్రస్థుతం   ప్రపంచ సినిమా పై  కరోనా ప్రభావం భయంకరంగా చూపిస్తోంది. అందాజుగా అంచనా వేస్తేనే దాదాపు వరల్డ్ వైడ్ గా సినిమాకు 40 వేల కోట్లకు పైగా  నష్టం కనిపిస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఎక్కవగా కనిపిస్తోంది. అయితే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో భారీ బడ్జెట్ లో పెద్ద ప్రాజెక్ట్స్ పట్టాలపై ఉన్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఊగిసలాడుతున్నాయి. స్పెషల్లీ ట్రిపుల్ ఆర్ కి ..  అంటే రామ్ చరణ్, రామారావ్, రానా కి పెద్ద దెబ్బ తగిలేలా ఉంది.

 

ఏడాది నుంచి సినీ ప్రియుల్నీ... ఫ్యాన్స్ ను ఊరిస్తుంది ట్రిపుల్ ఆర్ సినిమా. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదుర్కొంటూనే ఉన్న సినిమాపై మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు కరోనా ఎఫెక్ట్ కూడా పడింది. 450 కోట్ల బడ్జెట్.. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు..  తిరుగులేని డైరెక్టర్.. ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న సినిమా.. హాలీవుడ్  యాక్టర్స్.. అద్భుతమైన టైటిల్.. ట్రిపుల్ ఆర్ గురించి ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. ఈ మధ్యే ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అని టైటిల్ ఎనౌన్స్ చేశారు.. చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా సీతారామరాజు క్యారెక్టర్ ప్రోమో కూడా రిలీజ్ చేశాడు తారక్ . అసలే  మొదటి నుంచి అనేక సమస్యలతో సతమతమౌతున్న ఈ సినిమా ఇప్పుడు కరోనా తో కూడా సఫర్ అవ్వాల్సి వస్తోంది.

 

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ సీతారామరాజుగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తోన్న ఈ సినిమాకు మొదటి నుంచి చాలా సమస్యలు వేధించాయి.. సినిమా చాలా వరకు కంప్లీట్ అయినా.. హీరోయిన్ విషయంలో ఈ మధ్యనే క్లారిటీ వచ్చింది. ఇక ఇద్దరు హీరోలు చెరోసారి ప్రమాధంలో గాయపడటంతో  షెడ్యూల్స్ లో చేంజెస్ వచ్చాయి. రామ్ చరణ్ సైరా ప్రొడ్యూసర్ గా  బిజీగా ఉండి ఆ మధ్య షూటింగ్ డిస్ట్రబ్ అయ్యింది. ఇలా చాలా సమస్యలు ట్రిపుల్ ఆర్ ను వెంటాడాయి.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ఎన్నిరోజులకు షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: