ప్రభాస్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ తలకిందులు అవుతున్నాయి, ఈ ఏడాది చివరకు వరకు ఇఫ్పుడున్న సినిమాను కంప్లీట్ చేసుకుని.. ఇయర్ ఎండ్ లో పాన్ వరల్డ్ సినిమాను ట్రాక్ ఎక్కిద్దాం అనుకన్నాడు. కాని కరోనా.. డార్లింగ్ కలలన్నీ కల్లలు చేసింది.

 

ఇక సాహో తరువాత యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్  ఊరిస్తూ వస్తున్న జాన్ మూవీ కూడా కరోనా ఎఫెక్ట్ తో వెనకడుగు వేస్తోంది. కరోనా వైరస్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు.. రిలీజ్ లు.. ఫారెన్ షెడ్యూల్స్ కాన్సిల్ చేసుకుని మరీ ఇంట్లో కూర్చుంటే.. ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం జార్జియా వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. ఇక ఇండియాతో పాటు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండటంతో కామ్ గా షెడ్యూల్స్ పోస్టో పోన్ చేసుకున్నారు.

 

యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు రాధే శ్యామ్, ఓ డియార్ డైటిల్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్య వరకు సరిగ్గా నడవలేదు.  సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్ళు పైనే అయినా..ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ తోఇంకా 50 పర్సంట్ కూడా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈ మధ్యే షూటింగ్ పరుగులు పెడుతుంది అనుకున్న టైమ్ కు కరో్నా ఎఫెక్ట్ తో ఈ ఏడాదికి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అందులోనూ ఇటలీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించే ఈ సినిమాలో ఏదో ఒక షూట్ కోసం అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కాని ఇటలీలో కరోనాతో వేలల్లో చనిపోతుండటంతో ఇఫ్పుడు ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపిచండం లేదు.

 

మరోవైపు జాన్ కంప్లీట్ అయ్యే టైమ్ కు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తో ప్యాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ మూవీ ఈ ఇయర్ ఎండ్ కు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఇఫ్పుడు జాన్ షూటింగే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇక ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి.. ఎప్పుడు రిలీజ్ అవ్వాలి..  వైజయంతీ మూవీస్  దాదాపు 500 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చూస్తే ప్రభాస్ కి కరోనా గట్టి దెబ్బే తగిలించిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: