డాషింగ్ అండ్ క్రియేటివిటీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక దశలో వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయాడు. ఆ త‌రువాత ఎందుకో కెరీర్‌లో కాస్త తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లు రావటంతో స్టార్ హీరోలు పూరికి ముఖం చాటేశారు. ఏదైనా స‌రే అంతేక‌దా బెల్లం చుట్టూ ఈగ‌లు వాలిన‌ట్టు ఏదైనా ఒక హిట్ వ‌చ్చిందంటే చాలు హీరోలంతా ఆ ద‌ర్శ‌కుడు చుట్టూ తిరుగుతారు. అలాగే ఫ్లాప్ వ‌చ్చినా కూడా అస్స‌లు ప‌ట్టించుకోరు. 

 

ఇక ఇదిలా ఉంటే... కొన్ని సార్లు హీరోలు కూడా క‌థ‌లు విన్న‌ప్పుడు వాళ్ళ‌కు న‌చ్చ‌క‌పోతే రిజ‌క్ట్ చేస్తూ ఉంటారు. అలా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కెరియ‌ర్‌లో కూడా రిజ‌క్ట్ చేసిన సినిమాలు త‌ర్వాత అవి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా పూరి ప‌వ‌న్ కు చెప్పిన స్టోరీలు ఆయ‌న‌కు న‌చ్చ‌క రిజ‌క్ట్ చేసి అవి సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన‌వి ఆయ‌న కెరియ‌ర్‌లో మూడు సినిమాలున్నాయి. అవేమిటంటే... ఒక‌టి `ఇడియట్‌` చిత్రం. ఆ చిత్రం క‌థ ముందుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి చెప్పార‌ట‌. అయితే ఆ చిత్ర క‌థ చెబుతున్నంత‌సేపు ప‌వ‌న్ ఎంజాయ్ చేశారు కానీ, చివ‌రికి ఎందుకో రిజ‌క్ట్ చేశార‌ట‌. ఆ త‌రువాత `అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి` కూడా ముందుగా స్టోరీ విన్నారు కానీ పూరికి మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. ఇక చివ‌రిగా మ‌హేష్ కెరియ‌ర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన `పోకిరి` స్టోరీ కూడా ముందు ప‌వ‌న్ విన్న‌ప్ప‌టికి ఆ చిత్రాన్ని కూడా ఆయ‌న రిజ‌క్ట్ చేశార‌ట‌. అలా ప‌వ‌న్ దాదాపు మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను మిస్ అయిన‌ట్లే అని చెప్ప‌వ‌చ్చు.

 `

ఇక ఆ చిత్రాలు రవితేజకు మంచి ప్లస్‌ అయ్యాయి. అయితే పూరికి ప‌వ‌న్ ప‌రిచ‌యం కాక‌ముందు ర‌వితేజ‌, పూరి ఇద్ద‌రూ కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా ప‌ని చేసేవార‌ట‌. ర‌వితేజ‌తో ఎప్ప‌టికైనా నీతో సినిమా చేస్తా అంటూ పూరి ర‌వితేజ‌తో అనేవాడ‌ట‌. అయితే ఆ విష‌యాన్ని ర‌వితేజ పెద్ద‌గా ప‌ట్టించుకునేవాడు కాద‌ట‌.  ‘బద్రి’ తర్వాత సినిమా చేస్తానని చెబితే ‘కల్యాణ్‌గారితో చేసిన తర్వాత నాతో చేస్తావని అనుకోలేదు’ అన్నాడు. అప్పుడు ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చేసి హిట్ కొట్టార‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: