సినిమాల్లో ఓ హీరోను అభిమానించడం వేరు.. ఆరాధించడం వేరు. అటువంటి హీరో వర్షిప్ ను ఈ జనరేషన్ లో సంపాదించిన హీరో పవన్ కల్యాణ్ మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. తొలి మూడు సినిమాలను అన్నయ్య సలహాలతో, గైడెన్స్ తోనే చేశాడు. కానీ.. తొలిసారి తన ఓన్ జడ్జిమెంట్ తో చేసిన సినిమా పవన్ కెరీర్లో చాలా స్పెషల్ గా నిలిచింది. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమానే తొలిప్రేమ.

 

 

పవన్ ను స్టార్ హీరోగా మార్చటమే కాకుండా అసంఖ్యాకమైన ఫ్యాన్ బేస్ ను, క్రేజ్ ను సంపాదించిపెట్టింది. తొలిప్రేమ పాటలకు లేడీ వాయిస్ లేకపోవడం.. పాటల పిక్చరైజేషన్ సహజంగా తీయడం పవన్ సృష్టించిన స్టైలే. తమ్ముడు సినిమా ద్వారా తెలుగు సినిమాలో ఇంగ్లీష్ లో పాట రాయించి ట్రెండ్ సెట్ చేశాడు. బద్రిలో మెడ మీద చేయి వేసుకునే మాస్ మేనరిజమ్ స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇక ఖుషి సినిమాతో ఓ ప్రభంజనమే సృష్టించాడు. లవ్ బేస్డ్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది పవన్ మాత్రమే దక్కించుకున్న ఘనత.

 

 

తొలి సినిమా నుంచి ఖుషి వరకు వరుసగా ఏడు సినిమాలు హిట్లిచ్చినా.. తర్వాత ఏడేళ్లు వరుసగా ఫ్లాపులిచ్చినా పవర్ స్టార్ గా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇది పవన్ సాధించిన హీరో వర్షిప్ కు నిదర్శనం. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో రాష్ట్రంలో పవన్ నామస్మరణే జరిగింది. ఇంద్ర సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో ‘పవన్’ క్రేజ్ చిరంజీవే విస్తుపోయేలా చేసింది. అన్నగా చిరంజీవి సాధించిన క్రేజ్, స్టార్ డమ్ ను తమ్ముడిగా పవన్ అదే స్థాయిలో సాధించడం గ్రేట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: