టాలీవుడ్ సూపర్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన డ్యాన్స్, అభినయం అన్ని నందమూరి ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయి. సగటు సినీ ప్రేక్షకుడు కూడా మెప్పించేలా ఎన్టీఆర్ సినిమాలు ఉంటాయి. ఇప్పటివరకు 28 సినిమాలు చేసిన తారక్ తన నటనతో అందరిని మెప్పిస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ విలక్షణ నటులలో ఎన్టీఆర్ ఒకరు. కథ ప్రకారం ఎలాంటి చాలెంజింగ్ రోల్ అయినా సరే చేసే సత్తా ఉన్న తారక్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో పౌరాణిక పాత్రలు తను మాత్రమే చేయగలడు అనేలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తారక్ చాలామంది మనసులు గెలుస్తున్నాడు. 

 

తనదైన శైలిలో ప్రతి విషయం ఎంతో మెచ్యూరిటీతో ఆలోచించే ఎన్టీఆర్ ఇతర హీరోలతో చాలా మంచి స్నేహభావంతో ఉంటాడు. డైరక్టర్స్ తో కూడా తారక్ అదే రకమైన రాపో మెయిన్ టైన్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా కరోనా ప్రభావం వల్ల క్వారెంటైన్ లో ఉన్న సినీ స్టార్స్ తమ యాక్టివిటీస్ తో అలరిస్తున్నారు. అంతేకాదు సెలబ్రిటీస్ మధ్య ట్విట్టర్ ద్వారా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ #BeTheRealMan అంటూ రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి చేతిలో చీపురు, చేట పట్టుకుని ఇంటిని శుభ్రం చేశాడు. అయితే రాజమౌళి ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేశాడు. 

 

రాజమౌళి ఇలా పెట్టాడో లేదో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ తారక్ మెసేజ్ పెట్టాడు. మాములుగా సినిమాల్లోనే ఎలాంటి పాత్రకైనా సై అనే ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ కు రెడీ అంటున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. నేను రె.. రె.. రెడీ అంటూ జై లవ కుశలో చెప్పిన డైలాగ్ గుర్తుచేసుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఆన్ స్క్రీన్ లోనే ఎలాంటి పాత్ర అయినా చేసే తారక్ రియల్ లైఫ్ లో #BeTheRealMan ఛాలెంజ్ కోసం ఏం చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: