తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత జీవితంపై ప్రస్తుతం కొన్ని బయోపిక్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు రెండు సినిమాలు నిర్మితమవుతున్నాయి. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'తలైవి' ఒకటి...కాగా నిత్యా మీనన్ నటిస్తున్న సినిమా ఒకటి. ఇక 'తలైవి' సినిమాలో జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంతమంది కోలీవుడ్ జనాలు కంగన ని ట్రోల్ కుడా చేస్తున్నారట.

 

తమిళ ప్రజలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుంది. అయితే కంగనా అలా తమిళ నటి కాకపోవడం ఒక కారణం అయితే తను బాలీవుడ్ హీరోయిన్ కావడం మరోకారణం. ఈ సినిమాలో కంగన కు ఎవరైనా వేరే వ్యక్తి  చెప్పాల్సిందే. కంగనా స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకున్నా తమిళంలో అది సాధ్యమవదని అంటున్నారు. అందుకు కారణం  జయలలిత వాయిస్ కు కంగనా వాయిస్ కు మ్యాచ్ కాదు కాబట్టి. అయితే ఫిలింమేకర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు కాబట్టి కంగన ను సెలెక్ట్ చేసుకున్నారు.

 

కంగన ప్రపంచ వ్యాప్త్రంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే జయలలిత పాత్రలో కంగనా లాంటి స్టార్ హీరోయిన్ నటించడమే కరెక్ట్ అని పాన్ ఇండియా క్రేజ్ బాగా వందుందన్న ఆలోచనతోనే దర్శక నిర్మాతలు కంగనాను ఎంచుకున్నారు. అయితే తమిళనాడు తప్ప మిగతా అన్ని చోట్ల కంగన పై వ్యతిరేకత ఉండక పోవచ్చు అన్న మాట వినిపిస్తుంది. ఇక హిందీలో సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ వస్థుందని.. తమిళంలో మొదట్లో ఈ సినిమా పట్ల వ్యతిరేకత ఉనా సినిమా రిలీజయ్యాక మాత్రం ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు మేకర్స్.

 

మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇక వాస్తవంగా ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. మరి అనుకున్నట్టుగా రిలీజ్ చేస్తారా లేక ప్లాన్స్ మారతాయా ఇంకా క్లారిటి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: