దక్షిణ చలన చిత్ర పరిశ్రమలలో కాజల్ అగర్వాల్ గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 14 ఏళ్ల తన కెరీర్ లో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న అమ్మడు తన అందాలతో కుర్రకారుని భాషతో సంబంధం లేకుండా హోరెత్తించింది. తన ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలు ఉండగా దాదాపు తమిళ మరియు తెలుగు ఇండస్ట్రీలోని అందరు పెద్ద హీరోల సరసన నటించేసింది. ఇప్పుడు కుర్రహీరోయిన్ జోరు వల్ల కమర్షియల్ చిత్రాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి పర్ఫామెన్స్ కు ఆస్కారం ఉండే స్క్రిప్ట్‌లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది.

 

 

అయితే ఇలాంటి సమయంలో కాజల్ చెంతకు ఒక భారీ ఆఫర్ వచ్చింది. ఒక తమిళ సినిమా లో ఆమె కథ మొత్తం విని స్క్రిప్ట్ బాగా నచ్చి నటించడానికి ఒప్పేసుకుంది. అయితే ఆమెకు ఎప్పుడైతే సినిమాలో హీరో పేరు చెప్పారో వెంటనే ఆమె ప్రాజెక్టు నుంచి మరో ఆలోచన లేకుండా తప్పుకుంది. ఇంతకీ హీరో ఎవరో కాదు.... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి యొక్క మనవడు ఉదయ్ నిధి స్టాలిన్

 

ఉదయనిధి స్టాలిన్ మరియు హన్సిక జంటగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'ఓకే ఓకే' ద్వారా కొంతమంది మ్యూజిక్ మరియు సినీ లవర్స్ కు పరిచయస్థుడే అయిన హీరో మధ్యనే ఇళయరాజా సంగీత సారధ్యం వహించిన 'సైకో' అనే సినిమాను కూడా చేశాడు. అయితే కాజల్ కు మరియు ఉదయ్ కు అంతకు ముందు ఒక గొడవ జరిగింది. ఉదయ్ చలనచిత్ర మండలి లో ఒక కంప్లైంట్ కూడా కాజల్ పైన వేగా అతనికి ఆమె వద్ద నుండి 40 లక్షల రూపాయలు కూడా తిరిగి వచ్చాయి.

 

అయితే కాజల్ ఇప్పటి వరకూ అతనికి చెందిన 'రెడ్ జెయింట్స్' అనే బ్యానర్ పైన సినిమా చేయలేదు కానీ ఇప్పుడు ఆమెకు అవకాశం దొరికినా సినిమాలో హీరో ఉదయనిధి స్టాలిన్ అని తెలిసి వెంటనే తప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: