ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రతి రోజూ సినిమాలు చూస్తున్నారు ప్రజలు. ఈ సమయంలో రిలీఫ్ ఇచ్చేది సినిమా మాత్రమే. తమకు ఇష్టమైన హీరోల సినిమాలు చూసి ఎంజాయ్ చేసే వారు ఉంటారు. టాలీవుడ్ మన్మధుడిగా తన మార్క్ చూపించిన సీనియర్ స్టార్ హీరో.. అక్కినేని నాగార్జున. తొంభైల్లో అమ్మాయిల కలల రాకుమారుడుగా నాగార్జున లవ్, యాక్షన్ సినిమాలు చేశాడు. భక్తిరస చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. తన సినిమాల్లో చూడదగ్గ టాప్ 5 మూవీస్ గురించి చెప్పడం కష్టమే అయినా ప్రేక్షకులను మెప్పించే సినిమాలు ఉన్నాయి.

IHG

 

నాగ్ కెరీర్ లో శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా, మన్మధుడు, గీతాంజలి, సినిమాలను ప్రముఖంగా ప్రస్తావించాల్సిందే. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసాడు నాగార్జున. వర్మ దర్శకత్వం సినిమాకు కీలకమైనా కూడా నాగార్జున స్టూడెంట్ లీడర్, డాన్ పాత్రల్లో మెప్పించి స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. భక్తిరస సినిమా అన్నమయ్యలో నాగార్జున జీవించాడనే చెప్పాలి. ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆ సినిమా ఓ కళాఖండం అని చెప్పాలి. నిన్నే పెళ్లాడతా సినిమా ద్వారా కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు నాగార్జున. సినిమా ఆధ్యంతం ఫ్యామిలీ సందడితో ఉండే ఆ సినిమాకు ప్రేక్షకులకు మంచి ఫీల్ కలుగుతుంది.

IHG

 

తొంభైల్లో అమ్మాయిల కలల రాకుమారుడు అనిపించుకున్న నాగ్ 2కెలో కూడా అదే బిరుదును సార్దకం చేసిన సినిమా మన్మధుడు. ఈ సినిమాలో నాగ్ అందానికి తోడు అమ్మాయిలంటే పడని క్యారెక్టర్ లో తాను నిత్య మన్మధుడునే అనిపించాడు. తొంభైల్లో గీతాంజలి సినిమా కొత్త ఒరవడి సృష్టించింది. తెలుగు ఆడియన్స్ కు నచ్చని యాంటి క్లైమాక్స్ ఉన్న ప్రేమకథ ఈ సినిమా. నాగ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చినా నాగ్ నటన అద్భుతమనే చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: