స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో బన్ని మాస్ లుక్ అల్లు అర్జున్ ఆర్మీనే కాదు సిని ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేసింది. శేషాచలం అడవుల్లో.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో సినిమా వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ కొత్తగా అనిపిస్తున్నా సినిమా ఫార్మెట్ మాత్రం రంగస్థలం లానే ఉండేలా ఉంది. 

 

సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా రంగస్థలం. చరణ్ అద్భుతమైన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమా అందుకే సూపర్ హిట్ అయ్యింది. సుకుమార్ హిట్టు కొడితే ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసేలా చేశాడు. అయితే రంగస్థలం హిట్ తో పుష్ప చేస్తున్న సుకుమార్ ఈ సినిమాను అదే పంథాలో కొనసాగించాలని చూస్తున్నాడని తెలుస్తుంది. కథలో కొద్దిగా మార్పు ఉన్నా సేమ్ టూ సేమ్ రంగస్థలం లానే క్యారక్టరైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. 

 

సుకుమార్ ఏం చేసినా అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది వర్క్ అవుట్ అయితే చాలు సినిమా హిట్ అయినట్టే లెక్క. అందుకే బన్ని పుష్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ ఆడియెన్స్ ను కన్విన్స్  చేయాలంటే అంత పకడ్బందీ కథ రాసుకోవాల్సిందే. రంగస్థలంతో సంచలనం సృష్టించిన సుక్కు పుష్పతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడా చూడాలి.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: