కరోనా ఎఫెక్ట్ తో గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్ణయించాయి. అందుకే ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే తప్పదని అంటున్నారు. ఇక లాక్ డౌన్ టైం ను కొందరు పూర్తిగా సినిమాలకు పరిమితమవుతున్నారు. ఇంట్లో కూర్చుని తాపీగా సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిన ఈ హాలీడేస్, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ టైం లో ఏ సినిమాలు చూడాలో కొద్దిగా కన్ ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

 

అయితే ఇష్టమైన హీరోయిన్ సినిమాలు చూడాలన్నా సరే వాటిలో ఏది బెస్ట్ అనే ఆలోచన ఉంటుంది. అందుకే ఈరోజు అనుష్క ఫ్యాన్స్ కోసం ఆమె టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క కెరియర్ లో ది బెస్ట్ టాప్ మూవీస్ గురించి తెలుసుకుంటే.. కెరియర్ లో కమర్షియల్ సినిమాలతో పాటుగా అనుష్క ఫీమేల్ లీడ్ సినిమాలతో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కచ్చితంగా చెప్పాలంటే ఆమెకు కమర్షియల్ సినిమాలతో వచ్చిన ఇమేజ్ కన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వచ్చిన పాపులారిటీ టెక్కువని చెప్పొచ్చు. 

 

ఇక ఈ లాక్ డౌన్ టైం లో అనుష్క టాప్ 5 సినిమాలు ఏంటని చూస్తే.. అందులో మొదటిది అరుంధతి.. అనుష్క కెరియర్ ను ఆకాశానికి ఎత్తిన సినిమా అది. కోడి రామకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా సంచలనం విజయం అందుకుంది. ఆ సినిమాతో పాటుగా అనుష్క రుద్రమదేవి సినిమా కూడా చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. దర్శక నిర్మాతగా గుణశేఖర్ ప్రాణం పెట్టి చేసిన సినిమా అది. ఇక బాహుబలి రెండు పార్టుల్లో అనుష్క అద్భుతమైన నటన ఆకట్టుకుంటుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన భాగమతి సినిమా కూడా అనుష్క కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. హీరోయిన్ అంటే కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలన్న పంథాని మార్చి ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లానే డిఫరెంట్ సినిమాలతో అలరిస్తుంది అనుష్క. ఈ లాక్ డౌన్ టైం లో అనుష్క టాప్ 5 సినిమాలు మాత్రమే కాదు ఆమె నటించిన తెలుగు, తమిళ సినిమాలు మరికొన్ని చూసి ఇంట్లోనే ఉంది కరోనా బారిన పడకుండా మంచిది. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: