అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ వల్ల అతను ఒక్కరోజులోనే స్టార్ అయిపోయాడు. అప్పటి నుండీ అతని సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలని అందుకుంటూ గీతగోవిందంతో వచ్చాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో మనోడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పుడే డియర్ కామ్రేడ్ సినిమాతో దక్షిణాది భాషలన్నింటిలో రిలీజ్ చేశారు.

 

అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక అప్పటి నుందీ అతని వేగం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ హిట్ కొట్టీ చూపిస్తాడని అతని సినిమా వరల్డ్ ఫేమస్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సారి కూడా సీన్ రివర్స్ అయింది. నాలుగు ప్రేమకథలతో వచ్చిన ఈ చిత్రం జనాలకి బోర్ కొట్టింది. విజయ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

 


నాలుగు ప్రేమకథల్లో సువర్ణ, శీనయ్యల ఎపిసోడ్ మినహా ప్రేక్షకులకి పెద్దగా నచ్చింది ఏమీ లేదు ఆ సినిమాలో. అర్జున్ రెడ్డిని పోలినట్లు ఉన్న కథనే మళ్ళీ మళ్ళీ తీసారంటూ విజయ్ పై ట్రోల్స్ నడిచాయి. రిలీజైన రెండు మూడురోజులకే థియేటర్ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి జనాలు ఎగబడి చూస్తున్నారు.

 

అయితే అంతలా చూడడానికి కారణం లాక్డౌన్ అని అంటున్నారు. సినిమాలో ఏమీ లేకపోయినా, ఎందుకు ఆడలేదో చూద్దాన్న కుతూహలంతో కొందరు, ఖాళీగా ఉన్నాం కదా ఏఏం చేస్తాం అని మరికొందరు. ఇలా ఏ పనిలేక చూస్తుండడంతో ప్రతీ సినిమా ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రానికి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించగా, కేస్ రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: